Alexa
YSR
'ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వేదికకథ

ఆకాశాన్ని దాటిన విజయం

Others | Updated: February 17, 2017 01:17 (IST)
ఆకాశాన్ని దాటిన విజయం

విశ్లేషణ
అంతరిక్ష పరిశోధనల్లో, ఉపగ్రహ ప్రయోగాల్లో అద్భుత విజయాలు సాధి స్తున్న భారత్‌ అదే సమయంలో ఉపగ్రహాల నిర్వహణలో ఎదురవుతున్న న్యాయపరమైన అంశాల్లోనూ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

శ్రీహరికోట నుంచి బుధ వారం 104 ఉపగ్రహాలను విజయవంతంగా ఆయా అంతరిక్ష కక్ష్యలలోకి ప్రయోగించిన భారతదేశం ప్రస్తుతం అంతర్జాతీయం గా మన్ననలు పొందు తోంది. సాంకేతిక రంగం లో ఇది గొప్ప విజయం. అంతరిక్ష పరిశోధనా రంగంలో, ఖగోళాన్ని శాంతి అవసరాల నిమిత్తం వాడటంలో, అంతరిక్ష సాంకే తిక వాణిజ్య లోకంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్న భారత్‌ ఇప్పటికే అనేక దేశాల మన్ననలు పొందింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే సేవల రంగంలో అత్యంత తక్కువ ఖర్చుతో ఖచ్చిత  త్వంతో సేవలను అందిస్తూ, ప్రపంచంలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తున్నది. అంతరిక్షంలో ఉపగ్ర హాల నిర్వహణలో ఎదురవుతున్న న్యాయ నిబంధ నల్లో మరింత సమర్థ పాత్ర పోషించాల్సిన అవ సరం ఇప్పుడు భారత్‌ ముందు కొచ్చింది.

1957లో అలనాటి సోవియట్‌ యూనియన్‌ స్పుత్నిక్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన నాటినుంచి ప్రపంచ వ్యాప్తంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం పైన ఆసక్తి పెరిగింది. భారత్‌ 1960 నుంచే ఈ సాంకేతికత మీద దృష్టి పెట్టింది. క్రమేణా ఖగోళ పరిశోధనా, న్యాయపర అంశాలు చర్చలోకి వచ్చాయి. అంతరిక్షంలో మానవ కార్యకలాపాలను క్రమబద్ధం చేసే వైపు ప్రయత్నాలు మొదలైనాయి. ఈ అంశంలో భారత్‌ తొలినుండి క్రియాశీలంగా ఉన్నది. 1958లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ, కమిటీ ఆన్‌ పీస్‌ఫుల్‌ యూస్‌ ఆఫ్‌ ఔటర్‌ స్పేస్‌ (copus) కోపస్‌ సమావేశం జరిపింది అంత రిక్ష పరిశోధనను క్రమబద్ధం చేసి దానిని శాంతి యుత అవసరాలకు వాడేందుకు, ఆ రంగానికి చెందిన న్యాయపర అంశాలను రూపొందించేం దుకు ఈ కమిటీ ఏర్పడింది.

కోపస్‌ తొలి సమావేశాలనుంచి భారత్‌ సభ్యదే శంగా ఉంది. ఈ సమావేశాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ దాని తీర్మానాల అమలుకు సహకరిస్తూ ఉన్నది. ఖగోళ పరిశోధన, వ్యోమ నౌకలను పంపడం, దానికి సంబంధించిన విధి విధానాల, న్యాయపర అంశాల రూపకల్పన కోసం యూని స్పేస్‌ (ఐక్యరాజ్యసమితి శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం గురించిన సమా వేశం)లో పాల్గొన్నది. 1968, 1982, 1999లలో ఈ సమావేశాలు జరిగాయి. స్పేస్‌ టెక్నాలజీలో వస్తున్న అభివృద్ధిని ఇచ్చి పుచ్చుకోవడం. అభివృద్ధి చెందు తున్న దేశాలకు ఈ పరిజ్ఞానాన్ని అందిచడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశాలకు సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించిన ప్రముఖ
శాస్త్ర వేత్త డాక్టర్‌ యశ్‌పాల్‌ ఆధ్వర్యంలో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికత, సమాచార సాంకేతికతలో వచ్చిన నూతన ఆవిష్కరణలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందేటట్టు చూడటం జరిగింది.


పెరిగిన అంతరిక్ష శోధన వినియోగం అనేక న్యాయపర అంశాలను తెరమీదికి తెచ్చింది. ఈ రంగంలో కూడా భారత్‌ చురుకైన పాత్రను పోషిం చింది. 1969 నాటికే అంతరిక్ష న్యాయ సూత్రాలను చర్చించి ఢిల్లీ ప్రిన్సిపుల్స్‌ను రూపొందించింది. 1972 లయబిలిటీ కన్వెన్షన్‌ రూపొందడంలో భారత్‌ ప్రధాన పాత్ర వహించింది. అంతరిక్షంలో జరిగే పరిశోధన వల్ల జరిగే ప్రమాదాలకు బాధ్యత వహిం చడం ఎలా అనేది ఈ కన్వెన్షన్‌ ముఖ్య లక్ష్యం. అంత రిక్ష వినియోగానికి సంబంధించిన న్యాయ విధానం రూపొందాలని, అంతరిక్షం మానవాళికి చెందిన ఉమ్మడి వనరు అని భారత్‌ గట్టిగా వాదించింది.

యూఎన్‌–కోపస్‌ (UN-COPUS) పరిధిలో 1963లో అంతరిక్షాన్ని వివిధ దేశాలు ఎలా విని యోగించుకోవాలి అన్న విధి విధానాల రూపకల్పన జరిగింది. 1982లో బ్రాడ్‌ కాస్టింగ్‌ శాటిలైట్‌ విధానా లను రూపొందించారు, 1986లో రిమోట్‌ సెన్సింగ్‌ విధి విధానాలు రూపొందాయి. 1992లో ఖగో ళాన్ని అణు విద్యుత్‌ అవసరాలకు వాడకం మీద, 1996లో అభివృద్ధి చెందుతున్న  దేశాలకు అంతరిక్ష పరిశోధనా ఫలాలను అందజేసేందుకు నియ మాలు రూపొందినాయి. వీటిని అంతర్జాతీయ న్యాయ సంప్రదాయాలుగా ఆమోదించారు. వీటి పైన విశాల ఏకాభిప్రాయాన్ని రూపొందించి వీటికి అంతర్జాతీయ న్యాయ హోదా కల్పించే దిశగా భారత్‌ ప్రయత్నిస్తూ ఉన్నది.

అంతరిక్ష పరిశోధనా, సాంకేతికత, వాణిజ్యం అనే మూడింటినీ కలిపే జాతీయ అంతరిక్ష న్యాయ చట్టం రూపొందాల్సి ఉంది. 1999 యూనిస్పేస్‌ సమావేశాల్లో ఈ రచయిత పాల్గొని మూడో ప్రపంచ దేశాల దృక్పథాన్ని గట్టిగా వినిపించారు. దీనిపై  సమగ్ర నమూనా చట్టం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. శాస్త్రపరమైన విజయాల ఫలితా లను అందుకుంటూనే, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండడానికి ఇలాంటి చట్టం అవసరం ఎంతైనా ఉంది.(వ్యాసకర్త : ప్రొ. బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ ఎయిర్‌
అండ్‌ స్పేస్‌ లా సెంటర్, నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా ‘ 99486 60916)వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అవినీతి బయటపెడితే చాలెంజ్‍లా?

Sakshi Post

BJP, Congress Slam Kejriwal Over Promise To Abolish House Tax

Opposition BJP and Congress on Saturday dubbed Delhi Chief Minister Arvind Kejriwal’s promise to abo ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC