ఎవరికీ పట్టని భద్రతా సమస్య

ఎవరికీ పట్టని భద్రతా సమస్య - Sakshi


జాతిహితం

కొత్తగా ఖలిస్థానీ తీర్థం పుచ్చుకున్న కెనడా దిగుమతి బాపతు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రమాదాన్ని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఎండగట్టలేదు? కెనడా ప్రభుత్వంలోని కొత్త సిక్కు మంత్రుల గతం గురించి మోదీ ప్రభుత్వం దానికి ఎందుకు గుర్తు చేయలేదు, వారు ఖలిస్థాన్‌ అనే ఆ కాల్పనిక లోకం నుంచి బయటపడ్డారనే విస్పష్టమైన హామీని ఎందుకు కోరలేదు? ఈ శక్తుల నుంచి ఆమ్‌ ఆద్మీకి నిధులు అందుతున్నా కాంగ్రెస్, బీజేపీలు ఆందోళన వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరం.



పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అమరీందర్‌సింగ్‌తో గురు వారం నాటి ‘ఆఫ్‌ ద కప్‌’ (యథాలాపం) అనే నా కొత్త సంభాషణ వేదికలో మాట్లాడాను. ఆ సందర్భంగా ఆయన ప్రత్యేకించి తమ పార్టీకి సంతోషం కలి గించి ఉండని పలు విషయాల గురించి మాట్లాడారు. వాటిలో మొదటిది ఎల క్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లపట్ల ఆ పార్టీ వెలిబుచ్చుతున్న అనుమానానికి సమా« దానంగా చెప్పినది. ఆ మెషిన్లతో ఓట్లను తారుమారు చేయగలిగేట్టయితే ఇక్కడ నేను కాదు ‘ఎవరో ఒక బాదల్‌’ కూచుని ఉండేవారు అన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా ప్రధాన నాయకత్వం ఇదే సమస్యపై రాష్ట్ర పతి భవన్‌కు నిరసన తెలపడానికి వెళ్లిన రోజే సరిగ్గా ఆయన ఇది చెప్పారు.



ఆ తర్వాత ఆయన, జాతీయ పార్టీలు ఇకపై బలమైన ప్రాంతీయ నాయ కులు ఉండటం ముఖ్యమనే విషయాన్ని అంగీకరించక తప్పదని తన గెలుపు చాటిందని అన్నారు. ప్రజలు, తమ పరిపాలకులుగా తాము ఎన్నుకుంటు న్నది ఎవరినో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. జాతీయ నాయకులు వచ్చి ఓట్లు సంపాదించి పెట్టే ఆ రోజులు పోయాయి. మూడవది, అభ్యర్థుల ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం కూడా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంత మంచి ఫలితాలను సాధించడానికి కారణాలలో ఒకటని చెప్పారు. గత ఎన్నికల్లో 117 మందిలో 46 మందే తాను ఎంపికే చేసినవారని, పర్యవసా నంగా ఓటర్ల నుంచి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొని తమ పార్టీ ఓడిపోయిం దన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో ఏదీ ఆయన పార్టీగానీ, ప్రజలు ఎన్ను కోని దాని దర్బారీ నేతలకుగానీ సంతోషం కలిగించేది కాదు. అయితే జనాం తికంగా వారంతా ఆయన చెప్పినదంతా నిజమేనని గుసగుసలాడుతారు.



ఖలిస్థానీలపై అమరీందర్‌ దాడి

ఈ వ్యాఖ్యలకు ఆయన పార్టీ ఎలా ప్రతిస్పందించి ఉంటుందో కచ్చి తంగా తెలియదు. అయితే అమరీందర్‌ కెనడాలోని సిక్కు మిలిటెంట్ల సానుభూతి పరులపై చేసిన వ్యాఖ్యలు మాత్రం అత్యంత సంచలనాత్మకమైనవి, పతాక శీర్షికలకెక్కేవి. సిక్కు రెజిమెంటు (ఆయన అందులో పనిచేశారు) దేన్నీ లెక్కచేయకుండా చేసే దాడిలాంటి దాడి అది. అందరి ప్రశంసలను అందు కుంటున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఉదారవాద ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి అలాంటివే. పంజాబ్‌ పర్యటనకు రానున్న కెనడా రక్షణ మంత్రి, ఒకప్పటి కల్నల్, అఫ్గాన్‌ యుద్ధ హీరో వంటివారైన హర్జిత్‌సింగ్‌ సజ్జన్‌కున్న ‘‘ఖలిస్థాన్‌ సంబంధాల’’ కారణంగా తాను ఆయనను కలుసు కోవడం సైతం చేయనని చెప్పారు. కెనడా ప్రభుత్వంలో ఉన్న నలుగురు సిక్కు మంత్రులూ ఖలిస్థానీ సానుభూతిపరులేనని ఆయన అన్నారు. ఇది, ఒక పంజాబీకి లేదా సైనికునికి మాత్రమే ఉండగల క్రమశిక్షణ అనీ, తాను ఆ రెండూనని వ్యాఖానించారు. ఈ ‘‘ఖలిస్థానీ కార్యకర్తల’’ ఒత్తిడి వల్లనే తనను కెనడాకు రానివ్వలేదని, ఆ దేశానికి వెళ్లి అక్కడి పంజాబీలతో మాట్లాడతాన న్నారు. ట్రూడో ఉదారవాదాన్ని ప్రపంచమంతా ప్రశంసిస్తున్నట్టే తానూ మెచ్చుకుంటాననీ, కానీ కెనడాకు రానివ్వకుండా చేసి ఆయన నా భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ఎందుకు నిరాకరించినట్టు? అని ప్రశ్నించారు.



కెనడా ప్రభుత్వం తమ మంత్రులకు మద్దతుగా తక్షణమే స్పందించి, అమరీందర్‌ పర్యటనను స్వాగతించింది. అయితే అది అసలు కథనంలోని పిట్టకథే. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఊపిరిసలపకుండా తలమునక లయ్యే మన మీడియా అమరీందర్‌ సాధించిన ఈ అద్భుత దౌత్య విజయాన్ని పట్టించుకోకపోవడానికి ఏకైక కారణం.. కొంత మేరకు ఆయన బీజేపీకి చెందినవారు కాకపోవడం, కొంత మేరకు పంజాబ్‌కు వారి దృష్టిలో ఏమంత ప్రాధాన్యం లేకపోవడమే. సందర్భోచితంగా బీజేపీ తక్షణమే స్పందించి, అత్యున్నత జాతిహితం కోసం అమరీందర్‌ ప్రదర్శించిన సాహసాన్ని, ముక్కు సూటితనాన్ని స్వాగ తించి, విదేశాలలోని సిక్కు రాడికల్‌ గ్రూపులపై ఆయన చేసిన  విమర్శలకు బలాన్ని చేకూర్చి ఉంటే ఎలా ఉండేది?



కాంగ్రెస్, బీజేపీలకు పట్టని జాతీయభద్రతా సమస్య

ఎన్నికల్లో అమరీందర్‌సింగ్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి సహాయపడటం కోసం విదేశాలలోని సంపన్న రాడికల్‌ సిక్కులు భారీ సంఖ్యలో పంజాబ్‌కు రావడం ఆయనకు కచ్చితంగా ఆగ్రహం కలిగించింది. వారు ‘‘చాలా వరకు కెనడా నుంచి వచ్చినవారే, కొందరు ఆస్ట్రేలియా నుంచీ వచ్చారు’’ అని ఆయన అన్నారు. 1984 నాటి అమృత్‌సర్, ఢిల్లీ గాయాలను వారు తిరిగి రేపాలని యత్నించారు. వారి పక్షం గెలిచేట్టయితే ఆదే పాత భయానక చిత్రం తిరిగి ప్రదర్శితమవుతుందనే మాట వ్యాపించింది. అమ రీందర్‌ లేవనెత్తుతున్న సమస్య దేశభక్తుడైన ఏ  భారతీయుడైనా, ప్రత్యేకించి సరిహద్దులను దాటి విస్తరించిన ఏ జాతీయ పార్టీ అయినా లేవనెత్తాల్సినదే.



అమరీందర్‌ సొంత పార్టీ ఇలాంటి పరిస్థితికి తగ్గట్టుగా స్పందించ లేనంతటి నిద్రమత్తులో జోగుతూ ఉండి ఉంటుంది. బహుశా ఆ గతంలోని తన సొంత పాత్ర గురించిన అపరాధ భావన సైతం దానిలో ఉండి ఉంటుందా? తన దేశం గురించి, తన గురించి ప్రశంసాత్మక ప్రభావాన్ని కలుగజేయాలని ప్రపంచనేతలతో చర్చలు జరపడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టే వారు, ప్రత్యేకించి ఆ విషయంలో అత్యంత చాతుర్యాన్ని కలిగిన వారు అయిన నరేంద్ర మోదీ సైతం ఈ ఎత్తుగడను ఎలా విస్మరిస్తారు? కొత్తగా ఖలిస్థానీ తీర్థం పుచ్చుకున్న ఈ బాపతు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమాదాన్ని ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎందుకు ఎండ గట్టలేదు? కనీసం ఏదో ఒక సందర్భంలో ఆయన ప్రభుత్వం కెనడా ప్రభు త్వంలోని కొత్త సిక్కు మంత్రుల గత చరిత్ర గురించి ఆ దేశానికి ఎందుకు గుర్తు చేయలేదు, వారు ఖలిస్థాన్‌ అనే ఆ కాల్పనిక లోకం నుంచి బయట పడ్డారనే స్పష్టమైన హామీని ఎందుకు కోరలేదు?



భారత్‌ దృష్టిలో వారిలో కనీసం ముగ్గురి గతాలు ప్రమాదకరమైనవి. సజ్జన్‌ తండ్రి ప్రపంచ సిక్కు సంస్థ (డబ్యూఎస్‌ఓ) వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన ఒకప్పటి అఫ్ఘాన్‌ యుద్ధ వీరుడు. వాంకోవర్‌ కేంద్రంగా మిత్ర దేశాల కూటమికి సలహాలనిచ్చే గూఢచార సమాచార సేవల సంస్థను నడిపేవారు. మరోమంత్రి నవ్‌దీప్‌ సింగ్‌ బైన్స్‌. ఆయన మామ దర్శన్‌సింగ్‌ సైనీ నిషేధిత బబ్బర్‌ ఖల్సాకు అధికార ప్రతినిధిగా పనిచేసేవారు. తన గతాన్ని ఆయన ఎన్నడూ దాచుకోలేదు. మరో మంత్రి అమర్జిత్‌సింగ్‌ సోహీ వాస్తవానికి ఉగ్రవాద ఆరోపణలతో భారత్‌లో నిర్బంధంలో గడిపారు, తదుపరి ఆ ఆరో పణలేవీ రుజువుకాకపోవడంతో న్యాయస్థానాలు విడుదల చేశాయి. కెనడా ప్రభుత్వం ఈ విషయంలో జనాంతిక హామీలను ఇచ్చిందే తప్ప ఆ పాత ఉద్యమం గతించిపోయినదని నిర్ద్వంద్వంగా ప్రకటించలేదు. కెనడాలోని ఈ రాడికల్‌ శక్తుల నుంచి తమ ప్రత్యర్థులకు నిధులు అందుతున్నా కాంగ్రెస్, బీజే పీలు ఇంతవరకు ఆందోళనను వ్యక్తం చేయకపోవడం మరింత ఆశ్యర్యకరం.



జాతీయవాదాన్ని మోదీకి ధారాదత్తం చేసిన కాంగ్రెస్‌

ఒక స్థాయిలో ఇది రాజకీయ ఆధిక్యతను సాధించే అంశం. కానీ దీనిలో ఇమిడి ఉన్న ఒకొక్క అంశాన్ని విడిగా తీసుకుని లోతుగా విశ్లేషిస్తే.. మరింత ప్రగాఢమైన రాజకీయ సమస్యను సూచిస్తుంది. నేటికి దాదాపు ఒక దశాబ్దికి పైగా అమరిందర్‌ పార్టీ జాతీయవాద ఎజెండాను బీజేపీ ఎగరేసుకు పోవ డాన్ని అనుమతించింది. అలా అని యూపీఏ పాకిస్థాన్‌తో, ఉగ్రవాదులతో, చివరకి చైనాతో సైతం ఎన్నడూ మెతకగా వ్యవహరించింది లేదు. అయినా సోనియా గాంధీ కాంగ్రెస్, జాతీయ ప్రయోజనాలతో ముడిపడ్డ జటిల సమ స్యలపట్ల ‘‘మెతక’’గా వ్యవహరించేదనే పేరును సమంజసంగానే తెచ్చు కుంది. ఆ రంగాన్నంతటినీ మోదీ తన సొంత భావనతో చాపలా చుట్టేసుకు పోవడానికి వదిలిపెట్టేసింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణ పేరిట మోదీ అంతర్గర్భితమైన హిందుత్వ భావన చుట్టూ ఆ రంగంలో అజేయమైన జనా కర్షక  శక్తిని సమీకరించుకున్నారు.



బాట్లా హౌస్‌ ఎదురుకాల్పులపై సందేహాలను లేవనెత్తుతూ దిగ్విజయ్‌ సింగ్‌ తన సొంత పార్టీ వాదనను ఎలా నాశనం చేసేశారో గుర్తుకు తెచ్చు కోండి. ధైర్యసాహసాల ప్రదర్శనకు శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత  పుర స్కారమైన అశోకచక్రను తమ సొంత ప్రభుత్వం చేతుల నుంచే అందుకున్న ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆ ఎదురుకాల్పులలో మరణించారు. లేదంటే మావో యిస్టులకు మద్దతునిస్తున్నారంటూ రాజద్రోహ నేరారోపణకు గురైన బినా యక్‌సేన్‌కు ఉపశమనాన్ని కలుగజేయడానికి సహాయపడటాన్ని గుర్తు చేసు కోండి. అలా సహాయం చేయడం ఒక సంగతి సరే, కానీ బినాయక్‌ సేన్‌కు కీర్తిప్రతిష్టలను కట్టబెట్టేలా ప్రణాళికా సంఘానికి చెందిన ఒక ముఖ్య కమి టీలో ఆయనను సభ్యునిగా నియమించారు. ఇందిరా గాంధీ హయాంలో జాతీయ భద్రతా విషయాలలో అనుసరించిన కఠిన వైఖరిని ఆ పార్టీ విడిచి పెట్టేసిందనీ, అది ఒక ఎన్‌జీవోలా ఆలోచించడం ప్రారంభించిందనీ ఓటర్లను ఇలాంటి ఘటనలు పూర్తిగా ఒప్పించాయి.



ఉద్వేగభరితమైన ‘జాతీయ భద్రత’ సమస్యపై  మోదీ ప్రభుత్వాన్ని ఇర కాటంలో పెట్టే అవకాశాన్ని ఆ పార్టీ సొంత నాయకుడే అయిన అమరీందర్‌ సింగ్‌ సృష్టించారు. అయినా మోదీ ప్రభుత్వం కెనడా రక్షణమంత్రిని ఎలా ఆహ్వానిస్తుంది? దేశ సమగ్రతకు, దాని ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండటానికి ఆయన నుంచి విస్పష్టమైన హామీని కోరుతుందా?



కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలా నిద్రపోతోంది. బహుశా వాళ్లు అమరీందర్‌ మరీ ఎక్కువగా మాట్లాడటంలేదూ, అని ఆలోచిస్తుండొచ్చు. నరేంద్ర మోదీది ఎంత సునిశిత దృష్టో తెలిసిందే. ఆయనైతే ఈ విషయాన్ని వెంటనే మదిలో భద్రపరుచుకుని ఈ సమస్యను లేవనెత్తడానికి వచ్చిన మొట్టమొదటి సంద ర్భాన్నే అంది పుచ్చుకునేవారు. ఏదో ఒక విశ్వసనీయమైన హామీని లేదా విప రణను రాబట్టి... అమరీందర్‌ కల్పించిన ఈ అవకాశాన్ని తనకు అనుకూ లంగా వాడుకునేవారు. జాతీయవాదం అనే అంశం ఏ రాజకీయ పార్టీ, అన్ని టికి మించి ఏ జాతీయ పార్టీ వదిలి పెట్టకూడనిది. అలాంటి జాతీయవాదా నికీ, హిందుత్వకు మధ్య ఉన్న విస్పష్టమైన తేడాను గుర్తించగల శక్తి సైతం లేనిదిగా కాంగ్రెస్‌ మారేలా దాని బుర్రకు నూరిపోశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టిన గతే ఆ విషయాన్ని తెలుపుతోంది.





- శేఖర్‌ గుప్తా


twitter@shekargupta

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top