మురికివాడ ఓటు విలువ!

మురికివాడ ఓటు విలువ!


విశ్లేషణ

మురికివాడల వాసులకే ప్రజాస్వామిక విధుల పట్ల ఎక్కువ శ్రద్ధని మంగళవారం తేలడం ఖాయం. వారు తప్పక ఓటు చేయాలి, ఓటు చేసినటై్టనా కనిపించాలి. స్థానిక రాజకీయవేత్త ప్రాపకానికి హామీని కల్పించేలా ఓటు చేస్తే మరీ మంచిది.



భాగస్వామ్య ప్రజాస్వా మ్యంతో ఓ తంటా ఉంది. అది ఓటరు నిర్లిప్తత. ఓటు వేయని ఈ వర్గమే రాజ కీయాలను గురించి అతి ఎక్కు వగా పట్టించుకుంటుంది. నేటి రాజకీయాల తీరును విమర్శిం చడమూ, మొత్తంగా ఈ వ్యవ స్థలో రాజకీయ నేతలకు తప్ప ప్రజలకు ఏ విలువా లేదన్నట్టు వ్యాఖ్యానిం^è డం, తప్పు పట్టడం, నిందించడమూ మానరు. పౌరులుగా తమకు ఉన్న హక్కులలో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా ఒక టని విస్మరిస్తారు. ఓటు వేయనందుకు జరిమానాలు విధించడం ద్వారా తప్పనిసరి ఓటింగును అమలు చేయ డాన్ని నిరంకుశత్వ చర్యగా చూస్తుంటారు. పౌరులు తమ బాధ్యతను తాము నెరవేర్చడం నుంచే ఫిర్యాదు చేసే హక్కు పుట్టుకొస్తుంది. ఎన్నికల రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే ఈ వైఖరి... ఇప్పటికే పలు రుగ్మతలను ఎదుర్కొంటున్న మన రాజకీయ వ్యవస్థకు మరింత హానిని కలుగజేస్తుంది.



ముంబై ఈ ధోరణిని పదేపదే ప్రదర్శించింది. 2009 పురపాలక ఎన్నికల్లో అక్కడ 41 శాతం ఓటింగే నమోదైంది. కొన్ని వార్డుల్లో స్థానిక ఎన్నికల పోలింగ్‌ 21 శాతానికి సైతం దిగజారింది. ఓటింగు తక్కువగా నమో దయ్యే వార్డులలో అది 30–35 శాతా నికి అటూ ఇటుగా ఉంటుంది. రాజకీయాల వల్ల సంపన్నులు మరింత సంపన్నులు కావడమే జరగడం, గూండాలు రాజకీ యాల్లో పాల్గొనడం వంటి అంశాలు రుచించకపోవడం సమంజసమే. ఎన్నికల పట్ల విముఖతలో అవీ భాగమే. అయితే, శాసనసభ, పార్లమెంటులకు భిన్నంగా పురపా లక సంస్థ స్వయంపాలనా సంస్థ. కాబట్టి వివేకవంత మైన, విజ్ఞతాయుతమైన పౌర ప్రయోజనాలు పైచేయి సాధించాల్సి ఉంటుంది. ఏటా రూ. 37,000 కోట్ల బడ్జె ట్‌ను దుర్వినియోగం చేసే సంస్థకు ‘‘జీవన నాణ్యత’’ అనే భారీ పణాన్ని ఒడ్డాల్సి ఉంటుంది.



అధ్వానమైన పౌర సదుపాయాలు, రాజకీయ దురాశ ఈ నగరాన్ని జీవించరాని S భయానక ప్రదేశంగా మార్చేశాయి. ఈ నగరం అన్ని రకాల స్త్రీపురుషులకు, అన్ని రకాల శక్తిసామర్థ్యాలకు జీవనోపాధిని కల్పించేదే తప్ప, నివాసంగా ఎంచుకోదగిన ప్రాంతం మాత్రం కాలేదు. ప్రజలకు సేవలను అందించడానికి స్పష్టంగా నిర్దేశించిన నిబంధనలున్నాయి. కానీ సంపన్నులకు మాత్రం లెక్కలోకి వచ్చేది డబ్బే. మీరు ఎంచుకున్న వారే లంచాల క్రీడకు పాల్పడుతూ మీ నమ్మకాన్ని వమ్ము చేస్తుండటం ఎన్నికల ప్రక్రియనే పరిహాసాస్పదం చేస్తుంది. ఇంతకూ ఓటు ధర ఎంత? మధ్యతరగతి కూడా ఈ బాపతులో చేరిపోతోంది.



లోక్‌సభ, శాసనసభ లేదా మునిసిపల్‌ ఎన్నికలు ఏవైనాగానీ ఓటు చేసి తీరాలనే మరో విలక్షణ వర్గమూ ఉంది. సాంప్రదాయానుసారం మురికివాడల వాసులే ప్రజాస్వామిక విధుల పట్ల ఎక్కువ శ్రద్ధాసక్తులుగలవా రని మంగళవారం పోలింగ్‌లో తేలడం దాదాపు ఖాయం. అయితే, ప్రజాస్వామిక బాధ్యతను నెరవేర్చడ మనే గౌరవప్రదమైన ఉద్దేశం మాత్రమే వారు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడానికి కారణంగా చూప డం సరైనది కాదు. ప్రాపకపు వ్యవస్థ అనేదే అక్కడి రాజ కీయాలకు చోదకశక్తి, అదే వారిని ఆకర్షిస్తుంది. వారు ఓటు చేయాలి, ఓటు చేసినటై్టనా కనిపించాలి. గూండా లాంటి స్థానిక రాజకీయ వేత్త ప్రాపకం కొనసాగుతుం దని హామీని కల్పించే విధంగా ఓటు చేస్తే మరీ మంచిది.



సాధారణ చట్టాలు, నిబంధనలు సైతం మురికి వాడల్లో అంత తేలిగ్గా ఏమీ అమలుకావు. అవి నగరం లోనే మరో చీకటి నగరంగా ఉంటాయి. అద్దాల ధగధ గలతో మెరిసిపోయే ఆకాశహర్మ్యాలను లేదా చిన్నవే అయినా ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న గేటెడ్‌ కమ్యూని టీలను ముంబై నగరపు విలక్షణతని తప్పుగా చూపి స్తుంటారు. కానీ దాదాపుగా ఆ నగర జనాభాలోని

ప్రతి ఇద్దరిలో ఒకరు నివసించేది మురికివాడల్లోనే. ఈ నగరాన్ని నడిపించేది మురికివాడలే. వాటన్నింటినీ మూసేసి చూడండి.. మొత్తంగా ముంబై నగరమే కుప్ప కూలి, అరాచకత్వం నెలకొంటుంది. మురికివాడల వాసులను తొలగించడం, మురికివాడలలోని నివాసా లను కూల్చేయడం అనే ముప్పు పెద్దగా ఎదురుకాదు. చాలావరకు మురికివాడలకు రక్షణ ఉంటుంది. మురికి వాడలకు పురపాలక సంస్థ అందించే సేవలు అధ్వా నంగా ఉంటాయి. కాబట్టి అక్కడి వారికి ఎవరో ఒకరి ప్రాపకం కావాలి. తన సొంత గూండాలు, వాటర్‌ ట్యాంకర్లలాంటి సమాంతర సేవల నిర్వహకుల నిర్మా ణం ఉండే స్థానిక రాజకీయవేత్తే అలాంటి పెద్ద దిక్కు అయి ఉంటాడు.



మురికివాడలలో ఉండని వారికి పౌరసేవలు బాగా అందుతుంటాయి. మురికివాడల వాసులు ఎప్పుడు, ఎంతగా అందుతాయో ఇతమిత్థంగా తెలియని సేవల కోసం వారికంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. మురికి వాడ నివాసాన్ని బాగు చేయించుకోవాలన్నా ‘రక్షణ డబ్బు’ చెల్లించాల్సిందే. మురికివాడ వాసికి సంబం« దించిన న్యాయమైన కేసునే అయినా పోలీసులు పట్టిం చుకోవాలంటే ఎవరో ఒక రాజకీయవేత్త నోటి మాట రికమెండేషన్‌ కావాల్సిందే. ఒక వ్యక్తి సదరు రాజకీయ వేత్తకు ఓటరైనాగానీ లేదా ఓటరు కాగలవాడే అయినా కావాలి. లేకపోతే వేధింపులు తప్పవు. పొరుగువారు తమపై ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ఉండేలా ఒదిగి ఒదిగి బతకాల్సి వస్తుంది. అందువల్లనే రాజకీయ వేత్తలు, మురికివాడల వాసులు కూడా మురికివాడ ఓటుకు విలువను ఇస్తారు.



- మహేష్‌ విజాపృకర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top