జాతీయగీతం గురించి తెలియదా?

జాతీయగీతం గురించి తెలియదా?


విశ్లేషణ

చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమనను జాతీయగీతంగానూ, వందేమాతరంను జాతీయగేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు.



జనగణమన జాతీయ గీతం, వందేమాతరం జాతీయగేయం గానూ ప్రకటించిన అధికారిక ప్రతుల కోసం హరిందర్‌ ధింగ్రా ప్రధాని కార్యాలయాన్ని కోరారు.  జాతీయ జంతువు (పులి), జాతీయ పక్షి (నెమలి), జాతీయ పుష్పం (పద్మం), జాతీయ క్రీడ (హాకీ)లకు సంబంధించిన అధి కారిక పత్రాలు కూడా అడిగారు. జాతీయగీతం, జాతీయ గేయం గురించి చెప్పకుండా తప్పించుకోవడమే కాకుండా, మిగతా ప్రశ్నలన్నీ పర్యావరణ శాఖకు సంబం ధించినవి అంటూ వన్య మృగ శాఖ సమాచార అధికారికి బదిలీ చేసింది ప్రభుత్వం. వారు జాతీయ పుష్పం, జాతీయ క్రీడ సంగతి వదిలేసి, జాతీయపులుల సంరక్షణ అథారిటీకి పంపారు. జాతీయగీతం, జాతీయగేయం గురించి తమకు సంబంధం లేదని జవాబిచ్చారు.



మొదటి అప్పీలులో అధికారి సరైన సమాచారం ఇచ్చారని సంతృప్తి చెంది అప్పీలు కొట్టిపారేశారు. రెండో అప్పీలు కమిషన్‌ ముందుకు వచ్చింది. ప్రధాని కార్యా లయం, వన్యమృగ విభాగం, పులుల అథారిటీలకు జనగణమన, వందే మాతరాల గురించి పట్టకపోవడం విచిత్రం. పులుల అథారిటీ అధికారి వాదం మరీ వింతగా ఉంది. మేము పులులను సంరక్షిస్తామే గానీ, అది జాతీయ మృగం ఎప్పుడైంది, దాని పత్రాలెక్కడున్నాయి వంటివి మాకు తెలియదన్నాడాయన. దరఖాస్తును మళ్లీ పర్యా వరణ మంత్రిత్వ శాఖ వన్యమృగ విభాగానికి పంపేశాడు. ఇన్ని బదిలీల తర్వాత కూడా బదులు రాలేదు.



పర్యావరణ మంత్రిత్వశాఖ దగ్గర జాతీయ మృగం, పక్షి, పుష్పం గురించిన పత్రాలు లేవు. అవి దొర కడం లేదట. పులుల సంరక్షణ అధికారి వైభవ్‌. సి. మాథుర్,‘ జాతీయ జంతువు పులే అయి ఉంటుంది కానీ, నాకు సరిగ్గా తెలియదు’ అన్నారు. అధికారికంగా చెప్పగలిగేది కూడా ఆయనకు తెలియదన్నమాట. సుదీర్ఘంగా ప్రశ్నిం చగా ఆయన ఒక లేఖ బయటపెట్టారు. దానిపైన తేదీ 30.5. 2011 అని ఉంది. అది అంతకు ముందురోజే చేరిందట. వన్యజీవ సంరక్షణ శాఖ డైరెక్టర్‌ జగదీశ్‌æ కిష్వన్‌ రాసిన ఆ లేఖ సారాంశం ఏమంటే, ‘పులిని జాతీయ జంతువుగా, నెమలిని జాతీయపక్షిగా ప్రకటించామనీ, కాని ఆ నోటిఫికేషన్లు కొంత కాలం నుంచి మాయమైపో యినాయి కనుక మళ్లీ నోటిఫై చేస్తున్నా’మని. ఈ డైరెక్టర్‌ గారికి కూడా జాతీయ పుష్పం గురించి తెలియదేమో, ఏమీ చెప్పలేదు. జనగణమన, వందేమాతరం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.



నవంబర్‌ 30, 2016న శ్యాం నారాయణ్‌ చౌస్కీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయగీతాన్ని గౌరవించడం పవిత్ర బాధ్యత, రాజ్యాంగబద్ధ దేశభక్తి, జాతీయ లక్షణం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

 

డిసెంబర్‌ 27, 2011కు జాతీయగీతం ఉద్భవించి 100 ఏళ్లు గడిచాయి. డిసెంబర్‌ 27, 1911న విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ బెంగాలీ భాషలో, భారత జాతీయ కాంగ్రెస్‌ కలకత్తా సమావేశాల వేదిక మీద పాడారు. ఆ సభ పేరు భారతసభ. గీతాన్ని బ్రహ్మగీతం అని టాగోర్‌ పిలిచారు.  డిసెంబర్‌ 28, 1917న మూడోరోజు కాంగ్రెస్‌ సభలో మరోసారి జాతీయగీతం ఆలపించారు.



1919లో రవీంద్రనాథ్‌ టాగోర్‌ మదనపల్లెలో ధియో సాఫికల్‌ కాలే జ్‌లో ఉన్నప్పుడు జనగణమన గీతాన్ని ఆలపించారు. తరువాత ఆయనే దీనిని ఆంగ్లంలోకి కూడా అనువాదం చేశారు. అయితే ఆ తరువాత జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్‌ టాగోర్‌ బ్రిటిష్‌ రాజు ఐదో జార్జిని  పొగు డుతూ రాశారనే విమర్శకు సంబంధించిన అనేక రచనలు సోషల్‌ మీడియాలో ప్రాచుర్యం పొందాయి. పూర్వం ఈ వివాదాన్ని లేవదీసినప్పుడే విశ్వకవితో పాటు, గాంధీ, నెహ్రూ ఆ వాదాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. చివరకు నెహ్రూ ఆగస్టు 25, 1948నాడు రాజ్యాంగసభలో శాసన కమిటీ ముందు జాతీయగీతంగా జనగణమన ఉండాలా లేక వందేమాతరం ఉండాలా అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చారు.



చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమ నను జాతీయగీతం గానూ, వందే మాతరంను జాతీయ గేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ప్రకటించారు. అయిదు భాగా లున్న ఈ గీతంలో మొదటి భాగాన్ని రాజ్యాంగ సభ జాతీయ గీతంగా జనవరి 24, 1950 నాడు ఆమోదిం చిందని అనేక పత్రికలూ, పత్రాలూ సూచిస్తున్నాయి.

 

కానీ ఏ ప్రభుత్వ శాఖ చేయవలసిన పనిని ఆ శాఖ చేయలేదు. జాతీయ గీతాన్ని గౌరవించాలని ఆర్టికల్‌ 51 (ఎ) కింద ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. జాతీయ గౌరవాలకు అవమానాలు నిరోధించే చట్టం 1971 ప్రకారం జాతీయగీతాన్ని కావాలని అవమానిస్తే నేరం. బిజో ఎమ్మాన్యుయెల్‌æ కేసులో సగౌరవంగా మౌనం పాటించిన ఇతర మత విద్యార్థులను శిక్షించడం తప్ప న్నామేగానీ, జాతీయగీతం ఆలపించిన పుడు నిలబడి గౌరవించాలనే ఆదేశించడం జరిగిందని ఇటీవల సుప్రీం కోర్టు వివరించింది.



జాతీయ గీతం ప్రాధాన్యతను, చరి త్రను అధికారి కంగా ప్రకటించి ప్రజల్లో దానిపైన గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వానిదే. (హరిందర్‌ ధింగ్రా వర్సెస్‌ పర్యా వరణ శాఖ CIC/SA/A/2016/001453 కేసులో సీఐసీ 23.12. 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)



మాడభూషి శ్రీధర్‌

కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top