రాజకీయ రుగ్మతలకు విరుగుడు

రాజకీయ రుగ్మతలకు విరుగుడు - Sakshi


స్వేచ్ఛాయుతమైన, సక్రమమైన ఎన్నికలు పౌరులందరి హక్కు. తమ ప్రతినిధులపై ప్రజలు ఇక ఎంత మాత్రమూ విశ్వాసం ఉంచలేనప్పుడు, వారిని తొలగించే హక్కు సైతం ప్రజలకు ఉండాల్సిందే. రాజకీయవేత్తలు జవాబుదారీతనం వహించడం అనే వ్యవస్థపై ఆధారపడే నిజమైన అర్థంలో మనం ప్రజాస్వామ్యాన్ని సాధించుకోగలుగుతాం. వెనక్కు పిలిచే హక్కు  ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని లోతుగా విస్తరించా లంటే, ఓటు చేసే హక్కుతో పాటూ వెనక్కు పిలిచే హక్కు కూడా ఉండాలి.



‘‘ప్రజా ప్రతినిధుల పేరిట కొందరు వ్యక్తులతో కూడిన సంస్థకు అధికా రాన్ని దఖలుపరిస్తే, వీలు చిక్కితే వారు కూడా మిగతా వారందరిలాగే తమ అధి కారాన్ని సమాజ హితం కోసం గాక, తమ సొంత బాగు కోసం ఉప యోగిస్తారనడంలో సందేహం లేదు.’’ – జేమ్స్‌ మిల్‌



క్రీస్తు పూర్వం 5వ శతాబ్దినాటి ప్రాచీన  ఏథెన్స్‌వాసులకు తమదైన విశిష్ట ప్రజాస్వామ్యం ఉండేది. దానికొక విశిష్ట సామాజిక సంప్రదాయమూ ఉండేది. పరిపాలన కోసం ఉద్దేశించిన పది నెలల క్యాలెండర్‌ను అనుసరించి ఏడాదిలో ఆరవ లేదా ఏడవ మాసంలో (జనవరి లేదా ఫిబ్రవరి) ఏథెన్స్‌ వాసులంతా (పురుషులు) సమావేశమయ్యేవారు. ఎవరినైనా అభిశంసించి బహిష్కరించాలని అనుకుంటున్నారేమో వారిని అడిగేవారు. ఎవరినైనా బహి ష్కరించాలని వారు కోరితే (సాధారణంగా అధికారం నెరపే ప్రతినిధులు నియంతలుగా మారుతున్నారనిపించినప్పుడు), రెండు నెలల తర్వాత మరో సమావేశాన్ని నిర్వహించి కుండ పెంకు ముక్కలపై ఆ వ్యక్తి పేరును రాయడం ద్వారానో లేదా అవును, కాదు అనడానికి గుర్తుగా తెల్లటి, నల్లటి గులకరాళ్లను వేరు వేరు మట్టి పాత్రల్లో వేయడం ద్వారానో ఓటింగును నిర్వహించేవారు. అధికార మండలి అధ్య క్షుడు వాటిని లెక్కించేవాడు. అనుకూలంగా ఎక్కువ పెంకులు లేదా తెల్ల గులకరాళ్లు వస్తే ఆ ప్రతిపాదన నెగ్గినట్టు ప్రకటించేవాడు. అలా బహిష్కృతుడైన వ్యక్తిని (ఆస్ట్రకా) పదేళ్లపాటూ నగరంలో ప్రవేశించ కుండా వెలివేసేవారు. ప్రజాసభకు హాజరైన వారి సంఖ్య కనీసం 6,000కు తగ్గకుంటేనే ఓటింగును నిర్వహించేవారు. వ్యవస్థిత విచారణ, న్యాయ ప్రక్రి యలు లేకుండానే నియంతలు కాబోయేవారిని, అవినీతిపరులను అలాంటి పద్ధతుల ద్వారా నగర బహిష్కారానికి గురిచేసేవారు.



‘‘రాజధర్మం’’లోనూ ఉంది రీకాల్‌

ఆధునిక కాలపు ప్రజా ప్రతినిధులను ‘వెనక్కు పిలిచే హక్కు’ ఆ ప్రాచీన కాలపు పద్ధతుల వారసత్వ పరంపరలో ఏర్పడినదే. ఎన్నికైన ప్రజా ప్రతి నిధులను వారి పదవీ కాలం పూర్తిగాక ముందే ప్రత్యక్ష ఓటింగు ద్వారా వెనక్కు పిలవడం కోసం జరిపే ఓటింగును రికాల్‌ ఎలక్షన్‌ (వెనక్కు పిలిచే ఎన్నిక) అంటారు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్ర శాసనసభ ఇలా వెనక్కు పిలిచే ఎన్నికలను 1995 నుంచి అధికారికంగా ప్రవేశపెట్టి, ఓటర్లకు తమ పార్లమెంటు (శాసనసభ) సభ్యులను వారి పదవుల నుంచి వెనక్కు పిల వాలని విజ్ఞప్తి చేసే హక్కును కల్పించింది. అలా రీకాల్‌ ఎన్నికల ద్వారా వెనక్కు పిలిచినది రాష్ట్ర ప్రధానే అయితే, త్వరలోనే ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుపుతారు. అమెరికాలో కూడా ఇలాంటి రీకాల్‌ ఎన్నికలు శక్తిమంతమైన సాధనాలుగా ఉన్నాయి. అలాస్కా, జార్జియా, కన్సస్, మిన్నెసోటా, మోంటానా, రోడ్స్‌ ఐలాండ్, వాషింగ్టన్‌ రాష్ట్రాలు తప్పుడు నడవడిక,  దుష్ప్ర వర్తనవల్ల ప్రజాప్రతినిధులను వెనక్కు పిలిచే హక్కు పౌరులకు ఉంది.   



మన భారతదేశానికి ఇది కొత్త భావనేం కాదు. మన ‘‘రాజధర్మ’’ అనే భావనలోనే సమర్థ పాలనను అందించని కారణంగా రాజును తొలగిం చడమనేది వేద కాలం నుంచి ప్రస్తావనకు వస్తూనే ఉంది. ప్రముఖ భారత మానవతావాది ఎమ్‌ఎన్‌ రాయ్‌ 1944లోనే ఈ విషయాన్ని చర్చకు తెచ్చారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడాన్ని, వెనక్కు పిలవడాన్ని అనుమతించే వికేంద్రీకృత, సంక్రమిత రూప పరిపాలనకు మారాలని ఆయన ప్రతిపాదిం చారు. 1974లో జయప్రకాష్‌ నారాయణ్‌ సైతం వెనక్కు పిలిచే హక్కు గురించి విస్తృతంగా మాట్లాడారు. 1961 ఛత్తీస్‌గఢ్‌ నగర పాలకS చట్టాన్ని అనుసరించి 2008లో స్థానిక సంస్థల అధిపతులు ముగ్గురిని రీకాల్‌ ఎన్నిక ద్వారా వెనక్కు పిలిచారు. మధ్యప్రదేశ్, బిహార్‌లలో కూడా స్థానిక సంస్థల విషయంలో ఈ వెనక్కు పిలిచే హక్కు ఉంది. రాష్ట్ర శాసనసభల సభ్యులు, పార్లమెంటు సభ్యులు గణనీయమైన సంఖ్యలో తప్పుడు పద్ధతులకు పాల్ప డుతుండటమనే సమస్యకు పరిష్కారంగా... 2008లో నాటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ ‘‘వెనక్కు పిలిచే హక్కు’’ ప్రవేశపెట్టాలని కోరారు. స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సభ్యులను వెనక్కు పిలిచే హక్కును కల్పించడానికి అవసరమైన సవరణలను ప్రవేశపెట్టాలని కోరింది (ఇండియన్‌  ఎక్స్‌ప్రెస్, జూన్‌ 2011).



ఓటరు మెచ్చకపోతే గద్దె దిగాల్సిందే

నిజమైన ప్రజాస్వామ్యం ఏదైనాగానీ ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కోసం అనే దృష్టినే కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ముందుగా ఎవరు విజయ సూచికను చేరుతారనేదాన్నే లెక్కలోకి తీసుకునే మన ఎన్నికల వ్యవస్థలో ఎన్నికైన ప్రతి ప్రతిని«ధీ నిజ ప్రజామోదాన్ని కలిగినవారే కారు. ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అధికారం ఉండేట్టయితే, ఆ ప్రతి నిధులు తప్పుడు పనులకు పాల్పడినప్పుడు లేదా తమ విధులను పరిపూర్తి చేయడంలో విఫలమైనప్పుడు  వారిని తొలగించే అధికారం కూడా ఉండాలి. ఇది తార్కికంగానే కాదు, న్యాయపరంగా కూడా అవసరం.  ఇప్పటికైతే ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్న పౌరులు వారి పట్ల అసంతుష్టితో ఉన్నా, చేయ గలిగినది ఏమీ లేదు. 1951 నాటి మన ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికైన ప్రతినిధులు కొన్ని రకాల నేరాలకు పాల్పడినప్పుడే వారిని అధికారంలోంచి తొలగించే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేతప్ప, ప్రతినిధుల సార్వత్రిక అస మర్థత లేదా ఎన్నుకున్న ఓటర్లు వారిపట్ల అసంతృప్తితో ఉండటం వంటి కారణాలతో తొలగించడానికి లేదు. అయితే వెనక్కు పిలిచే హక్కు వంటి చట్టాలను ప్రవేశపెట్టేటప్పుడు తప్పక తగు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాలి ఫోర్నియా గవర్నర్‌ను వెనక్కు పిలిచే ఎన్నికల్లో ప్రత్యేక ప్రయోజనాల ప్రభావం బాగా ప్రాచుర్యం పొందింది.



ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు (2016)

ఒక పార్లమెంటు సభ్యునిగా నేను వెనక్కు పిలిచే హక్కును ప్రవేశపెట్టే క్రమాన్ని ప్రారంభించడం కోసం ప్రజాప్రాతినిధ్య సవరణ బిల్లును(2016) పార్లమెంటులో ప్రవేశపెట్టాను. పార్లమెంటు, శాసనసభలకు ఎన్నికైన ప్రతి నిధులను వెనక్కు పిలవడానికి విజ్ఞప్తి చేయడాన్ని అనుమతించాలని ఆ బిల్లు కోరింది. అలాంటి విజ్ఞప్తిని ఆమోదించడానికి ఆ ప్రజాప్రతినిధి ఎన్నికైన నియోజకవర్గ ఓటర్లలో కనీసం నాలుగింట ఒక వంతు సంతకాలు చేయాలనే నిబంధనను ఆ బిల్లు విధించింది. ఈ వెనక్కు పిలిచే క్రమం నిరర్థకమైనదిగా మారకుండటానికి హామీ ఉండాలి. అదేసమయంలో అది ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వేధించడానికి అవకాశం కాకుండా జాగ్రత్త వహించాలి. అందువల్ల ఈ వెనక్కు పిలిచే క్రమానికి సంబంధించి అలాంటి విజ్ఞాపనపై సంతకాల సేకరణ నుంచి చివరికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను జరిపి తుది నిర్ణ యాన్ని వెల్లడించే వరకు పలు జాగ్రత్తలను అందులో ఇమడ్చాల్సి ఉంటుంది. విజ్ఞాపనా పత్రంపై చేసిన సంతకాలను సరిచూడాలని, తొలుత దానిపై సంబంధిత సభ స్పీకర్‌ సమీక్ష జరపాలని ఆ బిల్లు సూచించింది. అంతేగాక, ఒక ప్రతినిధిని ఓటర్లు అతి స్వల్ప ఆధిక్యతతోనే వెనక్కు పిలవకుండా, ఆ క్రమం ప్రజాభీష్టానికి ప్రాతినిధ్యం వహించేలా.. వెనక్కు పిలిచే విజ్ఞాపన గెలుపొందడానికి లభించాల్సిన ఆధిక్యత కూడా ఎక్కువగా ఉండాలి. ఈ క్రమాన్నంతటినీ పారదర్శకంగా, స్వతంత్రంగా నిర్వహించడం కోసం ఎన్ని కల కమిషన్‌ అధికారులనే చీఫ్‌ పిటిషన్‌ ఆఫీసర్లుగా నియమించాలి. ఈ అవ కాశాన్ని దుర్వినియోగపరచే వీలు ఉన్న దృష్ట్యా అలాంటి చర్యలకు తగు శిక్షలను విధించడానికి కూడా ఈ బిల్లు వీలును కల్పించింది.



ఓటు చేసే హక్కున్నట్టేæవెనక్కు పిలిచే హక్కూ ఉండాలి

వెనక్కు పిలిచే హక్కు ఉండటం, పై నుంచి కిందికి జవాబుదారీతనానికి హామీని కల్పిస్తుంది. అలాంటి హక్కు అవినీతి పాలిటి అంకుశమే కాదు, రాజ కీయాలు నేరమయమవుతున్న క్రమానికి అడ్డుకట్ట అవుతుంది. ప్రజా ప్రాతి నిధ్యానికి సంబంధించిన మన వ్యవస్థాగత చట్రాన్ని మార్చడం... ఎన్నికైన మన ప్రజాప్రతినిదులకు లభించే వ్యక్తిగత ప్రాబల్యాన్ని, సంపదను పెంపొం దింపజేసుకునే అవకాశాలు, ప్రోత్సాహకాలపై ప్రభావాన్ని చూపుతుంది. నిర్దిష్ట కాలపరిమితి వరకు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సి రాని ప్రతినిధుల కంటే, తిరిగి ఎన్నిక కావాల్సి వచ్చేవారు భిన్నంగా ప్రవర్తిస్తారనే అంశాన్ని చాలా అధ్యయనాలు ప్రముఖంగా వెలుగులోకి తెచ్చాయి. మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉన్నవారి పాలనలో వృద్ధి విలక్షణంగా అధికంగా ఉండటం, పన్నులు, రుణ వ్యయాలు తక్కువగా ఉండటం కనిపి స్తుంది. స్వేచ్ఛాయుతమైన, సక్రమమైన ఎన్నికలు దేశ పౌరుల హక్కు. తమ ప్రతినిధులపై ప్రజలు ఇకనెంత మాత్రమూ విశ్వాసం ఉంచలేనప్పుడు... వారిని తొలగించే హక్కు ప్రజలకు తప్పక ఉండాలి. రాజకీయవేత్తలు జవాబు దారీతనం వహించడం అనే వ్యవస్థపై ఆధారపడే ప్రజాస్వామ్యాన్ని దాని నిజ అర్థంలో  మనం సాధించుకోగలుగుతాం. పైగా ఇది ఎన్నికల వ్యయాలను పరిమితం చేస్తుంది కూడా. నైతిక ప్రవర్తన సక్రమంగా లేని అభ్యర్థులు... ఎన్నికైనా తిరిగి తమను వెనక్కు పిలిచే అవకాశం ఉండటమనే  ప్రమాదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ హక్కు మన దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పడానికి దోహదపడుతుంది. ప్రజలకు అవకా శాల అందుబాటును విశాలం చేస్తుంది, సమ్మిళితత్వాన్ని పెంపొందింప జేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని లోతుగా పెంపొందింపజేయాలంటే, ఓటు చేసే హక్కుతో పాటే వెనక్కు పిలిచే హక్కు కూడా ఉండాలి.





- వరుణ్‌ గాంధీ


వ్యాసకర్త బీజేపీ పార్లమెంటు సభ్యులు

ఈ–మెయిల్‌: fvg001@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top