ఆస్ట్రేలియాలో వినూత్నంగా రాఖీ వేడుకలు




సిడ్నీ: 'సిస్టర్ ఫర్ చేంజ్: గిఫ్ట్  ఏ హెల్మెట్' ఈవెంట్‌ను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మికంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, మహిళా విభాగం ఇంచార్జి సంగీత దూపాటి ఆధ్వర్యంలో జరిపారు. ఎంపీ కవిత సంకల్పానికి మద్దతు పలుకుతూ సంగీత దూపాటి, రాజేష్ రాపోలు సిడ్నీలో ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అభినందించారు.



హెల్మెట్ వాడక పోవడం వల్ల ప్రతి ఏడాది డెబ్భై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి హెల్మెట్ వాడకంతో కలిగె ప్రయోజనాలను సిస్టర్స్ ద్వారా హెల్మెట్ ను బహుకరించడం అనే ఈ వినూత్న కార్యక్రమానికి మద్దతు తెలపాలన్నారు. విమెన్ వింగ్ ఇంచార్జి సంగీత, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు, న్యూ సౌత్ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని, వరుణ్ నల్లెల్ల, పరశురామ్, జస్వంత్ లకి రాఖీలు కట్టి హెల్మెట్ లను బహుకరించారు. మద్దతు తెలిపిన వారికి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నేతలు జస్వంత్ కోదారపు, వరుణ్ నల్లెల్ల, పరశురామ్ ముటుకుల్ల, రవి శంకర్ దూపాటి, ఇస్మాయిల్, గుల్షన్, వివిధ సంఘాల నాయకులకు న్యూ సౌత్ వేల్స్ ఇంచార్జి విక్రమ్ కటికనేని కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top