అలాంటి దారులన్నీ దావోస్‌కే

అలాంటి దారులన్నీ దావోస్‌కే - Sakshi


రెండో మాట

ఇందులో విస్తుపోవాల్సిన అవసరం లేదు. 1991 బ్యాంకు సంస్కరణలపై బేషరతు సంతకాలు చేసింది పీవీ–మన్మోహన్‌ ప్రభుత్వమే అయినా, రాష్ట్రాలలో తొలి చర్యగా అమలు జరిపినది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. ‘షరతులతో బ్యాంక్‌ సంస్కరణలను ఆమోదించా’నని చంద్రబాబు ప్రకటించిన 24 గంటల్లోనే, ‘కాదు, బాబు బేషరతుగానే అంగీకరించార’ని దాపరికం లేకుండా ప్రపంచ బ్యాంకు ప్రకటించి తెలుగువాళ్ల పరువు తీసింది.



‘వర్ధమాన దేశాల వనరులను పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద సంపన్న రాజ్యాలు దశాబ్దాలుగా దోచుకుంటూనే ఉన్నాయి. రాజకీయ స్వాతంత్య్రం పొందినా ఆర్థిక పరాధీన స్థితిలో ఉన్న ఆ దేశాల పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అలాగే సంపన్న రాజ్యాల (ఆంగ్లో–అమెరికన్‌)తో వర్ధమాన దేశాల సంబంధాల స్వభావంలో కూడా చెప్పుకోదగిన మార్పు కూడా లేదు. ఫలితంగా ఈ దేశాలు ఈ రోజుకీ సంపన్న దేశాలకు నిరంతరం అసలు, వడ్డీల రూపంలో చెల్లింపులు చేస్తూనే ఉన్నాయి. ఇది పచ్చి నిజం. ఎందుకంటే వర్ధమాన దేశా లను సంపన్న రాజ్యాలు ప్రపంచీకరణ వలలోకి లాగి మార్కెట్‌ ఆర్థిక దోపిడీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత 1979 నాటికే బడుగుదేశాలు రుణాల ఊబిలో కూరుకుపోయాయి. అయినా ఈ దేశాలు రుణగ్రస్త స్థితి నుంచి బయ టపడడానికి తమ అవసరాలను పణంగా పెట్టుకుని డాలర్‌ విలువలోనే 7.673 ట్రిలియన్‌ల (ట్రిలియన్‌ = 1 నుంచి 18 సున్నాలు కలపాలి) డాలర్లు ఇప్పటికే సంపన్న దేశాలకు చెల్లించి రుణ విమోచన పొందాయని అంతర్జాతీయ ఫెడరల్‌ యూనివర్సిటీల ఆర్థిక నిపుణుడు పాలోని కటానీ, రెమీ హెరారీ సాధికారికంగా తేల్చి చెప్పారు. అయినా సంపన్న దేశాలు మాత్రం వర్ధమాన దేశాలు ఇంకా రుణపడే ఉన్నాయని బుకాయిస్తున్నాయి.’

– మంత్లీ రివ్యూ (జూన్, 2007)



వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు సాధించవలసినంత పురోగతి సాధించలేక పోవడానికి కారణం–ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ  (ఐఎంఎఫ్‌) ప్రజా వ్యతిరేక విధానాలే. ఈ రెండు సంస్థలనీ తన అవసరాల కోసం అమెరికా పెంచి పోషిస్తున్నది. వాటితో పాటు వేలాది కుంభకోణాల ద్వారా దేశదేశాల నుంచి జనించిన నల్లడబ్బుకు నిలయమైన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వ్యవహారాలు కూడా మరొక కారణమే. నలభై ఏడు సంవత్సరాలుగా దావోస్‌ ప్రపంచ కుబేర వర్గాల రహస్య మంతనాలకు, బడా పెట్టుబడుల విస్తరణకు సరికొత్త కేంద్రంగా వ్యవహరిస్తున్నది.



ఇండియా సహా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని పలు దేశాలు ఇంకా రుణ బాధలోనే మిగిలిపోయా యంటే అందుకు కారణాలు వేరు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల పుణ్యమా అని ఇలాంటి దేశాలు నిరంతరం రుణ బాధలో ఉంటేనే తమ అదుపాజ్ఞలలో ఉంటాయనీ, స్వతంత్ర ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఇస్తే తమ పెత్తనా నికి కాలం చెల్లిపోవడమే కాకుండా, అవన్నీ ప్రతిఘటనా శక్తులుగా నిలబడే ప్రమాదం కూడా ఉందనీ సామ్రాజ్యవాద దేశాల నిశ్చితాభిప్రాయం. సామ్రా జ్యవాద దేశాలూ, అవి పెంచి పోషిస్తున్న వ్యవస్థలూ క్షేమంగా కొనసాగడానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగాలని పెద్ద రాజ్యాల ఆశయం. కనుకనే 1980 నాటికి వర్ధమాన దేశాలు తమకు చెల్లించవలసిన రుణం మరో 618 బిలియన్‌ డాలర్ల నుంచి 3,150 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలని (2006 నాటికి) సామ్రా జ్యవాద దేశాలు సరికొత్త పేచీకి దిగాయి.



రుణ బాధ మూలాలు

ఇండియా సహా ఇలా నిరంతరం రుణ బకాయిల నుంచి బయటపడలేక సత మతమవుతున్న వర్ధమాన దేశాల సంఖ్య 135 అనీ, ఇవి వడ్డీ, అసలు చెల్లిం చలేక అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోతున్నాయని ఐఎంఎఫ్‌ కబుర్లు చెబుతోంది. ఆదిలో (అంటే 1980 ప్రాంతం) కన్నా ఇప్పుడు ఆసియా దేశాల రుణం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి కూడా. ఇవి తీర్చుకోవలసిన రుణాలూ, వడ్డీలూ 1980 నాటికి వాటి జాతీయోత్పత్తుల విలువలో 2.8 శాతం ఉండేవి. అవి కాస్తా 1989 నాటికి 4.0 శాతానికి, 1999లో 6.9 శాతా నికి పెరిగాయి. అంటే దేశీయ పాలకులు ఈ విదేశీ పెట్టుబడులకు అర్రులు చాస్తున్న సంగతి రుజువైంది. దేశ ప్రయోజనాలనీ, స్వతంత్ర విధానాలనీ, దేశీయమైన పద్ధతులనీ, సొంత సాంకేతిక విధానాలనీ, దేశీయ వస్తూత్పత్తి రంగాలనీ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో మొదట్లో ఉన్న స్వతంత్ర మార్గాలనీ కూడా వారు వదులుకుంటున్నారు. ఫలితంగా పరాధార స్థితికి బానిసలైనందుకే దిక్కుతోచని వారిగా తిరగవలసి వచ్చింది.



చంద్రబాబు యాత్రల మర్మం?

ఈ పూర్వ రంగంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు 1990 నాటికే ప్రపంచ బ్యాంక్‌ పంచకు చేరారు. అప్పటికే ప్రపంచ బ్యాంక్‌ అనుబంధ సంస్థలు ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ ప్రపంచ పెట్టుబడుల బ్రోకరేజీ సంస్థలుగా ఏర్పడినాయి. అలాగే దావోస్‌ కేంద్రంగా దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు గుంపు వ్యాపార గూడుపుఠాణీ క్లబ్‌గా ఏర్పడ్డారు. ఆ దావో స్‌కే చంద్రబాబు పెట్టుబడుల సమీకరణ పేరుతో అధికార స్థాయి పర్యాటకు నిగా వెళ్లారు. జనవరి 17 నుంచి 21 వరకు ఆయన జరిపిన ఆ యాత్ర ఫలితం ఏమిటో ఆయన నోరు విప్పితే తప్ప తెలియదు. ఈ యాత్రకు ముందు కూడా ఆయన దావోస్‌ పర్యటన పేరుతో రెండు యాత్రలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలు, అవి ఎన్ని కోట్లకు సంబంధించినవో లేదా ఎన్ని పెట్టబడుల అవగాహన పత్రాలో ఇంతవరకు వెల్లడి కాలేదు. నిజానికి తొలి పర్యటనల సందర్భంగా చెప్పిన పెట్టుబడుల రాక వివరాలు కూడా వెల్లడి కాలేదు. లేదా ఆశించిన మేరకు రాలేదన్న మాట కూడా ఆ సీఎం నోటి నుంచి వినపడలేదు.



దావోస్‌ తాజా యాత్ర, పెట్టుబడులు, ఇతర ఒప్పందాల వివరాలు కూడా షరా మామూలే. ఏపీకి రాగల పెట్టుబడుల మాటెలా ఉన్నా, ఒక ఆకాశరామన్న హామీ వార్త గురించి మాత్రం సీఎం కార్యాలయం కర్ణాకర్ణీగా (9–1–‘17) వెల్లడించింది. అదైనా ఎక్కడ నుంచి అందిన సమాచారం? చైనా పెట్టు బడులు ఆంధ్రకు రావచ్చునని గ్లోబల్‌ బ్రోకర్‌ సంస్థ మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ సంచాలకుడు జోనాథన్‌ ఓజల్‌ చంద్రబాబు చెవిలో ఊదాడట. కానీ చైనా నుంచి అధికారిక సమాచారం మాత్రం లేదు. నిజానికి అమరావతి రాజధాని నిర్మాణం బాగోతం విన్న తరువాత మళ్లీ చైనా పెట్టుబడుల కథ ఎక్కడా వినపడలేదు. ఇలాంటి పెట్టుబడి కథలు సింగపూర్, మలేసియా, జపాన్‌లు కేంద్రంగా కూడా వినిపించాయి. కాగా, దావోస్‌లో చంద్రబాబు ఎన్ని సంస్థల యజమానులతో, లేదా ప్రతినిధులతో సమావేశాలు జరిపారో మెకెన్సీ గ్లోబల్‌ కాఫీక్లబ్‌ జాబితాలో ఏకరువు పెట్టింది. కానీ ఎన్ని పెట్టుబ డులు ఎంత మోతాదులో రానున్నాయో ముచ్చటకైనా మెకెన్సీగానీ, ముఖ్య మంత్రిగానీ చెప్పలేక పోయారు. అంతేగాదు–ఈ సమావేశాలన్నిటా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు బాబు వెన్నంటే ఉన్నారని దావోస్‌ వార్తలు చెబు తున్నాయి.



ఎన్ని ఒప్పందాలు జరిగాయో?

ఇందులో విస్తుపోవాల్సిన అవసరం లేదు. 1991 బ్యాంకు సంస్కరణలపై బేషరతు సంతకాలు చేసింది పీవీ–మన్మోహన్‌ ప్రభుత్వమే అయినా, రాష్ట్రా లలో తొలి చర్యగా అమలు జరిపినది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది బహి రంగ రహస్యం. ‘షరతులతో బ్యాంక్‌ సంస్కరణలను ఆమోదించా’నని చంద్రబాబు ప్రకటించిన 24 గంటల్లోనే, ‘కాదు, బాబు బేషరతుగానే అంగీ కరించార’ని దాపరికం లేకుండా ప్రపంచ బ్యాంకు ప్రకటించి తెలుగువాళ్ల పరువు తీసింది. ఇంతకూ–ఏపీ రాజధాని నిర్మాణానికి దేశీయ శాస్త్ర, సాంకే తిక నిపుణులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కన్‌స్ట్రక్షన్‌ ఇంజనీరింగ్‌ మహామ హులు, వాస్తు శిల్పులు వగైరా ఉండగా విదేశీ నిపుణుల కోసం పడిగాపులు దేనికి? నీ బంగారం నీ వద్దనే ఉండగా దాన్ని వినియోగించుకోలేక గాలి కబుర్లు, గావు కేకలు ఎందుకు?



మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. ‘డాకూ’ లంతా దావోస్‌ కుబేరుల దుస్తుల్లో కొలువు తీరడానికి రమ్మని  ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం–డబ్ల్యూటీఎఫ్‌) ప్రత్యేక ఆహ్వానాలను పంపించిందా? అది స్వేచ్ఛా విపణి కాబట్టి ‘టూరిస్టు’లుగానే ఫోరమ్‌ సమావేశాలకు వెళ్లారా? ఒకవేళ సొంత ఖర్చుల మీదనే దేశాధినేతలు వెడితే దావోస్‌ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యే వారికి రూ. 8 లక్షల 60 వేలు ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. అలాకాక ‘ప్రత్యేక ఆహ్వానితుల’ జాబితాలో చంద్రబాబును చేర్చి ఉంటే ఈ ప్రవేశ రుసుంతో నిమిత్తం లేదా? ఈ వివరాలన్నింటినీ ప్రజా ప్రయోజనాల కోణం నుంచి విశ్లేషిస్తూ ఈ వ్యాసకర్త పదిహేడేళ్లనాడే (11.2.2000) తెలుగు ప్రజలకు వెల్లడించాడు: ‘మొదట్లో కేవలం వ్యాపార వర్గాలకే పరిమితమైన దావోస్‌ సభలు క్రమంగా రాజకీయ నాయకులకు కూడా వేదికలుగా మారాయి. అలా అయితేనే దేశాల జాతీ యార్థిక వ్యవస్థలను ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా తారుమారు చేసి, పూర్తి స్థాయిలో క్యాపిటలిస్టు వ్యవస్థలుగా దిద్ది తీర్చడానికి అవకాశం ఉందని దావోస్‌ సభా నిర్వాహకులకు తెలుసు. ఈ లోపాయికారీ నిర్వహణకు రాజ కీయ వేత్తలు అవసరం. కనుకనే రాజకీయ నేతలకు కూడా ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టించుకున్న ప్రపంచ బ్యాంక్‌ అధి నేత ఉల్ఫెన్‌సన్‌lచంద్రబాబును వాషింగ్టన్‌ రమ్మని ఆహ్వానించడం ఇందులో భాగమే (2000 ఫిబ్రవరి వ్యాసం).



దావోస్‌ పాఠం ఏమిటి?

రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు. నిరసనల మధ్యనే ఆయన గెలిచినట్టు ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్‌ అమెరికా వస్తూత్పత్తి రక్షణకే (ప్రొటెక్షనిజం) ప్రపంచాన్ని శాసించి పరిపాలిం చాలనే నియంతృత్వ పోకడలకు మళ్లుతున్నాడు. పాత విధానాలను తిరగ దోడుతున్నాడు. సమాచార సాంకేతిక వ్యవస్థలో వర్ధమాన దేశాల ప్రయోజ నాలకు ఎసరు పెట్టబోతున్నాడు. చెనా, ఇండియాలతో కాలు దువ్వే అహం కారంతో ఉన్నాడు. కాగా ‘ప్రపంచీకరణ’ ద్వారా ప్రయోజనం పొందవలసిన ఆచరణాత్మక వ్యూహ రచనకు చైనా స్వాగతం పలుకుతూనే ‘ఈ విధానం ద్వారా అన్ని దేశాలు లాభించాలంటే, వర్ధమాన దేశాలలో అణగారిన సామాన్య ప్రజా బాహుళ్యాల ప్రయోజనాలకు, వారి ఉద్ధరణకు పెద్ద పీట వేయాలని, అప్పుడే నిజమైన విమోచన’ అని ప్రకటించింది. దావోస్‌ తాజా సభలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సందేశమిదే. ప్రస్తుత అసమ ఆర్థిక చట్రాన్ని పూర్తిగా మార్చవలసిన అవసరం ఉందన్నది ఆయన నిశ్చితా భిప్రాయం. అంటే, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే కార్పొరేట్‌ రంగ పెట్టుబడులను సామాజిక ప్రయోజనాలకు మళ్లించకుండా–వాటిని బాండ్లలో, షేర్లలో, రుణాలకు ప్రభుత్వం మళ్లిస్తున్నది. అందుకే అప్పు చేసినప్పుడే చెప్పుచేతల్లో ఉండాలన్నారు. ఇదే అంతిమంగా దావోస్‌ పాఠం!



ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top