ఆపన్నులకు సాక్షి అభయ

ఆపన్నులకు సాక్షి అభయ - Sakshi

  •  ఆపద ఎదురైనప్పుడు సహాయపడే ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపకల్పన

  •  ఒక్క క్లిక్‌తో మీరున్న ప్రదేశంతోపాటు ఆదుకోవాలంటూ సన్నిహితులకు మెసేజ్, మెయిల్

  •  నిందితులను పట్టుకోవడానికి వీలుగా ఆటోమేటిక్  వీడియో రికార్డింగ్ కూడా

  •  అభయ అప్లికేషన్‌ను ఆవిష్కరించిన జగన్

  • ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు ‘సాక్షి’ మీడియా ముందుకొచ్చింది. ముఖ్యంగా ఉద్యోగినులు, వృద్ధులు, ఇంట్లో ఒంటరిగా ఉండే పిల్లలు ఇలా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు కేవలం ఒక్క క్లిక్‌తో వారికి సాయమందేలా ‘సాక్షి అభయ’ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌కు రూపకల్పన చేసింది. ముఖ్యంగా అతివలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అప్లికేషన్  వారిని అపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. దీన్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్‌కుమార్ తయారుచేశారు. ‘అభయ’ పనితీరును ఆయన వివరించారు.

     ‘సాక్షి అభయ’ అప్లికేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

     

      ఆపదలో రక్షణ ఇలా...

     

      ఈ అప్లికేషన్ పూర్తిగా ఉచితం. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మొబైల్ నంబర్లు, ఈమెయిల్, ఫేస్‌బుక్ ఐడీలను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

     

      ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అప్లికేషన్ హోంస్క్రీన్‌పై ఉండే ‘హెల్ప్’ అనే బటన్ క్లిక్ చేస్తే.. కేవలం 10 సెకన్ల వ్యవధిలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ద్వారా ఆ సమయానికి మీరున్న ప్రదేశం వివరాలతోపాటు సహాయాన్ని కోరుతూ ముందుగానే కంపోజ్ చేసి ఉన్న సందేశం మీ సన్నిహితులకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ రూపంలో వెళ్లిపోతుంది. అదే సమయంలో మీ ఫేస్‌బుక్ పేజీపై సదరు సందేశం పోస్ట్ రూపంలో ప్రదర్శితమవుతుంది. 10 సెకన్ల అనంతరం మీరు రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్‌కు కాల్ కూడా వెళ్తుంది.

     

      మీరు అపాయంతో ఉన్న సందేశంతోపాటు మీరుండే ప్రదేశం వివరాలు కూడా కచ్చితంగా అందడం వల్ల మీ సన్నిహితులు అలర్ట్ అయి.. పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా లేదా వారే స్వయంగా మీ రక్షణకు రంగంలోకి దిగే అవకాశముంటుంది. అంతేకాదు.. ఆ 10 సెకన్ల వ్యవధిలోనే మీ మొబైల్ ఆటోమెటిక్‌గా వీడియోను కూడా తీసి.. సెల్ మెమొరీ కార్డులో నిక్షిప్తం చేస్తుంది. నిందితులను గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈమెయిల్‌కు మెసేజ్‌తోపాటు ఫోన్ ఐఎంఈఐ నంబర్ కూడా వెళ్తుంది. ఒకవేళ మీ మొబైల్‌ను నిందితులు తీసేసుకున్నా.. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా వారిని పోలీసులు పట్టుకోవచ్చు.

      ప్రస్తుతం విరివిగా ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసేలా ‘అభయ’ అప్లికేషన్‌ను రూపొందిం చారు.  అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో పనిచేసే కొత్త వెర్షన్ త్వరలో విడుదలవనుంది.


    URL Link: https://play.google.com/store/apps/details?id=help.emergency.rakshak

Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top