'మంచి అన్నలా తోడుగా ఉంటా'

'మంచి అన్నలా తోడుగా ఉంటా' - Sakshi


గూడెపువలస: తమ భూములు లాక్కోవద్దని భోగాపురం ప్రజలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కునే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. భూములు లాక్కునే విషయంలో ప్రధానమంత్రే వెనక్కు తగ్గారని గుర్తు చేశారు. విజయనగరం జిల్లా గూడెపువలసలో ఎయిర్ పోర్టు బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....


  • భోగాపురం రైతుల బాధను రాష్ట్రానికే కాదు దేశానికి చూపించేందుకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం

  • మా భూములు లాక్కోవద్దని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

  • ఎయిర్ పోర్టు కోసం గద్దల్లా రైతుల భూములు లాక్కోవడానికి సిద్ధమయ్యారు

  • లంచాలకోసం కమిషన్ల కోసం చిన్న రైతులను రోడ్డున పడేస్తున్నారు

  • అవంతి శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు మినహాయించారు

  • వీళ్లంతా చంద్రబాబు బినామీలు కాబట్టే వారికి లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది

  • భూముల లాక్కునే విషయంలో ప్రధానమంత్రే వెనక్కు తగ్గారు

  • ఇంత మంది ఉసురు పోసుకుని భూములు లాక్కునే అధికారం చంద్రబాబుకు లేదు

  • పక్కనే ఉన్న విశాఖపట్నం విమానాశ్రయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి

  • ఎయిర్ పోర్టుకు 150 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే మరో ఎయిర్ పోర్టు కట్టాలి

  • విశాఖ విమానాశ్రయం ఇక్కడికి కనీసం 20 నాటికల్ మైలు దూరంలో కూడా లేదు

  • చెన్నై ఎయిర్ పోర్టు1280 ఎకరాలు, కొచ్చి 800, అహ్మదాబాద్ 960, ముంబై ఎయిర్ పోర్ట్ 2000 ఎకరాల్లోపు ఎకరాల్లో ఉంది

  • భోగాపురం ఎయిర్ పోర్టుకు వేల ఎకరాలు ఎందుకు

  • ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు లాక్కోనివ్వం

  • మంచి అన్నలా తోడుగా ఉంటా, అవసరమైతే కోర్టుకు పోదాం

  • గట్టిగా పోరాడతా, గట్టిగా నిలబడతా... ఈ పోరాటం ఆగదు, అన్ని రకాలుగా అండగా ఉంటా

  • ఒకవేళ అధికార బలంతో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కున్నా బాధపడకండి. మూడేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది

  • రాబోయేది మన ప్రభుత్వం. మేము అధికారంలోని వచ్చిన తర్వాత లాక్కున్న భూములు తిరిగిస్తాం
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top