రాజీనామా చేస్తారా.. ఛాలెంజ్!

రాజీనామా చేస్తారా.. ఛాలెంజ్! - Sakshi


ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కూడా తానే పంపానని అంటారేమోనంటూ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు విషయమై సభలో గందరగోళం జరిగిన తర్వాత టీడీపీకి చెందిన రావెల కిశోర్ బాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు వ్యక్తిగత విమర్శలు చేయడంతో... వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..


  • ఎవరు టాపిక్లో ఉన్నారు, ఎవరు లేరన్నది ప్రజలంతా చూశారు.

  • ఒక్కడిని చేసి ఇంతమంది వెంట పడుతున్నారన్నది అంతా చూస్తున్నారు

  • నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతారు, ఈయన మాట్లాడతారు, అడ్డుపడతారు, బురద జల్లుతారు

  • వాళ్లంతా ఎంత బాగా తిట్టారో అర్థమైంది. అబద్ధాలు చెబుతూ అచ్చెన్నాయుడు ఏమన్నారు.. టీఆర్ఎస్కు నేను మద్దతు ఇచ్చానా

  • నేను, కేసీఆర్కు లెటరిస్తే ఆ విషయం నీకెలా తెలిసింది.. కేసీఆర్ నీకిచ్చారా?

  • స్టీఫెన్సన్ ఎవరో నాకు తెలియదు. నేను లెటర్ ఇస్తే ఆయనకు పదవి ఇచ్చారంటున్నారు

  • నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే నువ్వు రుజువు చెయ్యి.. నేను రాజీనామా చేస్తా.

  • లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని నిండు సభలో ఛాలెంజ్ చేస్తున్నా

  • ఛాలెంజ్... ఛాలెంజ్.. ఛాలెంజ్...

  • చంద్రబాబు రాజీనామా చేస్తారా

  • నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా.. ఎవరినైనా రాజ్యసభకు పంపాలన్నా నాకు ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. నేను కోరుకున్నవాళ్లను పంపుతాను

  • ఇంకా నయం.. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపాను, నేనే డబ్బులిచ్చానని చెప్పలేదు. ఆ ఫోన్లలో కూడా మాట్లాడింది, వీడియోల్లో ఉన్నది కూడా నేనేనని చెప్పలేదు. అప్పటివరకు సంతోషం.

  • ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల బ్లాక్ మనీ పెట్టి మీరు సిద్ధమయ్యారు

  • మోదీ గారి దగ్గర చంద్రబాబు సాష్టాంగపడ్డారని చెప్పడానికి ఈ విషయం ప్రస్తావనకు తీసుకు రావాల్సి వచ్చింది.

  • ఆయన కళ్లు పెద్దవి చేసి వేళ్లు చూపించి భయపెడుతున్నారు.. మేమంతా భయపడుతున్నాం

  • మాకు మీ నుంచి రక్షణ కావాలి

  • ప్రత్యేక హోదా మీరు తెస్తారా, తేలేరా

  • కేంద్రానికి మీరు ఏవైనా హెచ్చరికలు చేయగలరా లేరా

  • మా మంత్రులను ఉపసంహరించుకుంటామని గట్టిగా అడగగలరా

  • 15 నెలల తర్వాత మేం ఈ మాటలు మాట్లాడుతున్నాం.

  • ఎందుకయ్యా మాట్లాడతావు ఊరికే..

  • చనిపోయినవారి గురించి ప్రేమ చూపించారు

  • చనిపోయినవాళ్లకు నివాళులు అర్పించే తీర్మానం ఇదేననుకుంటా

  • ప్రత్యేక హోదా కోసం చాలామంది చనిపోయారు. వీళ్లకు పరిహారం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు

  • శవాన్ని కాల్చడానికి 10 వేలు మాత్రమే ఇచ్చారు

  • మీ ప్రకటనల వల్లే వీళ్లంతా చనిపోయారు

  • ప్రత్యేక హోదా సంజీవని కాదని ఢిల్లీలో చంద్రబాబు అన్నారు

  • హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది, దానికి మించిన లబ్ధి కల్పిస్తామన్నారని స్వయంగా చంద్రబాబే చెప్పారు.

  • కోడలు మగబిడ్డను కంటామంటే అత్త వద్దంటుందా అని ఆయన అంటారు

  • ఇలాంటి కన్ఫ్యూజింగ్ ప్రకటనలు ఇస్తే పిల్లలు చనిపోకుండా ఏం చేస్తారు

  • మళ్లీ హైదరాబాద్ వచ్చి, హోదా కోసం పోరాడతాం అంటారు.

  • మేం అసభ్యంగా మాట్లాడామంటారు. కళ్లు ఎవరు పెద్ద చేశారో, ఎవరు వేళ్లు చూపించారో ప్రజలంతా టీవీలో చూస్తున్నారు

  • సబ్జెక్టులో ఎవరెంత సేపు ఉన్నారో రికార్డులలో చూద్దాం

  • మనం ఇక్కడినుంచి తీర్మానం చేసి పంపిస్తే, మీరు టైం బౌండుగా వార్నింగ్ ఇవ్వాలి

  • నెల రోజుల్లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించకపోతే ఫలితం ఉండదని చెబుతున్నా

  • ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న యావత్ యువతకు చెప్పేది ఒకటే

  • చనిపోయి సాధించేది ఏమీ ఉండదు. పోరాడైనా సాధిద్దాం. బతికుందాం.. పోరాడుదాం
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top