ఓల్డ్@ ఏజ్- యంగ్@లుక్

ఓల్డ్@ ఏజ్- యంగ్@లుక్ - Sakshi


మన యోగా మహిమ ఇదే

ఫొటో చూపించి ఇతగాడి వయసు ఎంత అని ఎవరైనా అడిగితే ఎవరైనా ఏమి చెబుతారు. సుమారుగా ఓ 50 ఏళ్లు ఉంటాయంటారు. అయితే అలాంటి జవాబు చెబితే మాత్రం శుద్ధ తప్పే. టర్కీకి చెందిన కజీం గుర్బజ్ వయసు సరిగ్గా 95 ఏళ్లు. అంటే సెంచరీకి దాదాపుగా చేరువులో ఉన్నాడన్నమాట. ఇంతకీ ఈ రహస్యమేమిటనేదేగా మీ సందేహం. ఏమీ లేదండీ  ప్రతినిత్యం యోగా చేయడమే. పైగా ఇతగాడు యోగా గురువు కూడా.  క్రమబద్ధమైన జీవితం గడపడంతోపాటు ప్రతినిత్యం యోగా చేస్తే ఎటువంటివారైనాఅవలీలగా 130 సంవత్సరాలు జీవించొచ్చంటాడు 1920లో జన్మించిన కజీం.  అసలైన జీవితం 65 ఏళ్ల తరువాతే మొదలవుతుందంటాడు. ‘మనం 130 సంవత్సరాల వయసు వరకూ జీవించవచ్చు.



నాకు కూడా అంత వయసు దాకా బతకాలని ఉంది. తమ గురించి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి శక్తి వస్తుంది. అప్పుడు వారు కూడా నా మాదిరిగానే కనిపిస్తారు’ అని చెప్పాడు కజీం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తాన ని, వెంటనే కొద్దిసేపు ఈత కొడతానని చెప్పాడు. అలా చేయడం తనకు ఎంతో శక్తిని ఇస్తుందంటున్నాడు.



ఇక యోగాలో అనేక క్లిష్టమైన భంగిమలు కూడా వేస్తాడు కజీం. శరీరాన్ని తాడులా చేసి 48 గంటలపాటు అలాగే ఉండిపోగల శక్తి కజీం సొంతం. అంతేకాదు సుమా నాలుగు నుంచి ఐదు నిమిషాలపాటు శ్వాసను బంధిస్తాడు. శ్వాసను బంధించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. ఇక శృంగారంలోనూ ఇప్పటికీ తాను చురుగ్గానే పాల్గొంటున్నానని తెలిపాడు కజీం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top