'స్వచ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు, చెంచు, ఆదివాసి గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు'

Advertisement

న్యూస్ ఫ్లాష్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచవరంలలో స్వల్ప భూకంపం Share on:
మీరు ఇక్కడ ఉన్నారు: హోం న్యూస్కథ

మురుగు వదలాలంటే రూ. 3 వేల కోట్లు!

Sakshi | Updated: June 10, 2013 01:40 (IST)
India :ప్రపంచ బ్యాంకు అంచనా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో మురుగు వదలాలంటే వేలకోట్లు ఖర్చు చేస్తే తప్ప సాధ్యం కాదని ప్రపంచ బ్యాంకు తేల్చింది. రోజురోజుకు నగరాలు, పట్టణాల్లో చెత్త ఉత్పత్తి పెరిగిపోతున్నప్పటికీ... ఆ సమస్య నివారణకు తగిన నిధులు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు కాకుండా గతంలో ఉన్న 124 మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పేరుకుపోయిన మురుగు వదలాలంటే ఏకంగా రూ.3,100 కోట్లు అవసరం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ నిధులు సమకూరిస్తే తప్ప రాష్ట్రంలోని మునిసిపాలిటీలు మురికివాడల నుంచి పట్టణాలు, నగరాలుగా అవతరించడానికి వీల్లేదని పేర్కొంది. జాతీయ పారిశుధ్య విధానం కోసం రూపొందించిన నివేదికలో (రాష్ట్రానికి సంబంధించి) ఈ అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి 40 శాతం లోపుగానే ఉందని తెలిపింది. పారిశుధ్య కేంద్రాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.

శుద్ధి చేయకుండా వదిలేసిన మురుగునీరు అంతా మంచినీటి సరస్సులు, కుంటల్లోకి, వీధుల్లో ప్రవహిస్తోందని స్పష్టం చేసింది. ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకపోవడం, మురుగునీటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండడం వల్ల పట్టణాల్లో మురికిప్రాంతాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే మరుగుదొడ్లు సరిగాలేని కారణంగా పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ 11,600 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదని వివరించింది. ఈ చెత్తను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడం లేదని అందువల్ల అనేక మునిసిపాలిటీల్లో చెత్త ప్రధాన సమస్యగా మారుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. మునిసిపాలిటీల్లో సరైన డంపింగ్ యార్డులు లేకపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్తపారబోస్తున్న విషయం తెలిసిందే. నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే చెత్త పారబోయడం వల్ల.. వర్షంపడినా, ఆ చెత్తను తగలబెట్టిన సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో నివసించడానికి వీల్లేని విధంగా దుర్వాసన వస్తున్న విషయమూ విదితమే.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మహిళలకు భద్రత.. పరిశ్రమలకు చేయూత

Advertisement

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.