'పొగ'రాణులు పెరుగుతున్నారు!

'పొగ'రాణులు పెరుగుతున్నారు!


అన్ని రంగాల్లో ముందుకెళుతున్న పడతులు ధూమపానంలోనూ దూసుకెళ్తున్నారు. అవలీలగా సిగరెట్లు ఊదిపడేస్తున్నారు. పొగతాగడంలో భారత మహిళలు అగ్రదేశాలతో పోటీ పడుతున్నారు. ధూమపానంలో భారత వనితలు చైనాను వెనక్కు నెట్టి అమెరికా తర్వాత స్థానంలో నిలిచారు.



గత మూడు దశాబ్దాల్లో ఇండియాలో 'పొగ'రాణుల సంఖ్య రెండింతలు పైగా పెరిగిందని ఓ అంతర్జాతీయ పరిశీలనలో వెల్లడైంది. భారతదేశంలో 1.27 కోట్ల మంది ధూమపానం చేసే మహిళలున్నారని తేలింది. ధూమపాన నివారణ చర్యలతో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, రష్యా వుమెన్ స్మోకర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి.



భారత్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అత్యధిక మరణాలకు కారణవుతున్న వాటిలో మూడో స్థానంలో ధూమపానాన్ని అరికట్టడంలో పాలకులు విఫలమవడం ఈ పరిస్థితికి కారణం. ధూమపానంతో దేశంలో ఏడాదికి దాదాపు పది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని గణంకాలు వెల్లడిస్తున్నా పాలకులు కళ్లు తెరవకపోవడం శోచనీయం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top