అతిథిగా వచ్చిఅత్యాచారం చేసిన మహిళ!

అతిథిగా వచ్చిఅత్యాచారం చేసిన మహిళ! - Sakshi


సియాటిల్: పిలవకుండానే అతిథిగా వచ్చిన ఓ మహిళ మగాడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అమెరికాలోని సియాటిల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గత జూన్ నెలలో చంటాయ్ గిల్మాన్ (26) అనే మహిళ ఓ ఇంటికి కాని సమయంలో వచ్చి ఓ వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైంది.  జూన్ 17 వ తేదీన 5.7 అంగుళాలు ఉన్న గిల్మాన్ అనే మహిళ ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్నసమయంలోఅతని వద్దకు వచ్చి లైంగిక చర్యలకు దిగింది.  దీంతో మేల్కొన్న ఆ వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు నెట్టేశాడు. అనంతరం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


 


తాజాగా విడుదల చేసిన డీఎన్ఏ పరీక్షలో ఆమె అత్యాచారం చేసినట్లు తేలడంతో పోలీసులు గిల్మాన్ పై రెండో డిగ్రీ అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే అత్యాచారం చేసిన ఆరోపణలపై మాట్లాడటానికి ఆమె నిరాకరించింది. కాగా, ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆమె తమ బంధువుల్లో వ్యక్తేనని బాధితుడు పేర్కొన్నాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top