నాలుగు నెలల నుంచి ఇదే వరస

నాలుగు నెలల నుంచి ఇదే వరస - Sakshi


నాగపూర్(మహారాష్ట్ర): అసహజరీతిలో శృంగారానికి ఒత్తిడి చేయడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తున్న భర్తపై నాగపూర్ లో పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నాగపూర్ కు సమీపంలోని ఉమరర్ లోని ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్న అభిజిత్ రాంబావ్ రగ్డేట్(36)పై ఆయన భార్య ఈ కేసు పెట్టింది.



నాలుగు క్రితం తమకు పెళ్లైందని అప్పటి నుంచి ఇదే వరస అని బాధితురాలు వాపోయింది. మే 7 నుంచి ఆగస్టు 13 వరకు వేధించాడని వెల్లడించింది. లాకాఢ్గంజ్ లోని తమ ఇంట్లోలోనే కాకుండా, అతడి సొంతూరు హింగాంగ్హట్ లోనూ ఇదే తంతు అని తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభిజిత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top