రద్దయిన నోట్లు ఉంటే నేరమా? ఎలా?

రద్దయిన నోట్లు ఉంటే  నేరమా? ఎలా? - Sakshi


ముంబై:  పాత నోట్లపై కేంద్రం తీసుకున్న  తాజా  నిర్ణయం అనేక అనుమానాలకు, చర్చలకు  తావిచ్చింది.  రద్దయిన నోట్లను   కలిగి ఉండటం ఎలా నేరమవుతుంది. ఇపుడిదే ప్రశ్న  సామాన్య ప్రజలతో పాటు పలువుర్ని వేధిస్తోంది.   ప్రభుత్వ  ఆదేశాల ప్రకారం రూ.500,  రూ.1000   నోట్ల చలామణికి ఎలాంటి చట్టబద్ధత లేదు.   దీంతో ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. మరి తాజా ఆర్డినెన్స్  ఉద్దేశం ఏమిటి?


దేశంలో పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్న రూ.500,  రూ.1000 నోట్ల రద్దుచేస్తూ  నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సంచలన రేపింది. ఈ నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.  దీనికి కొంతగడువును , పరిమితులను విధించింది.  ఈ నేపథ్యంలోనే  ఇంకా  బయటపడని, చట్టపరంగా వెల్లడించని  నల్లధనానికి చెక్ పెట్టేందుకే తాజా ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఆర్బీఐ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం  నేరమే అవుతుంది.  చట్ట నిబంధనల ప్రకారం ఆయా  వ్యక్తులు  శిక్షార్హులే.  గతంలో 1978లో కూడా ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని  తీసుకొచ్చిన సంగతి గమనార్హం.


మరోవైపు కొన్ని రోజుల తరువాత   ప్రస్తుతం చలామణీలోకి తీసుకొచ్చిన కొత్త  రెండు వేల నోటును కూడా రద్దుచేసి, మళ్లీ వెయ్యి నోట్లను చలామణిలోకి  తేనున్నారనే వార్తలు  ఇటీవల   ప్రచారంలోకి వచ్చాయి.  రద్దు చేసిన పాత  రూ.1000  నోటుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి.  రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో  ప్రధాన ప్రతిపక్షాలకు, పలు రాజకీయ పార్టీలకు  చెక్  పెట్టేందుకు 2017 లో రెండు వేల నోటును కూడా రద్దు చేయనుందన్న వాదనలు కూడా  వినిపించాయి. 


ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పేర్కొన్న  ఈ కొత్త  ఆర్డినెన్స్ ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.  దీంతోపాటు పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.  



అయితే   బ్యాంకులు, పోస్టాఫీసుల్లో  రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30వరకు మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది.  డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది. ఈ  ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top