సిలికాన్‌ వ్యాలీలో కన్నీళ్లకు కొదవ లేదు


కాలిఫోర్నియా: అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ అందమైన ప్రదేశమే కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు అధిక జీతభత్యాలు ఉంటాయి. భార్యాభర్తలు కలిసి అక్కడే పనిచేస్తే ఇక వారి వైవాహిక జీవిత వైభోగానికి సరిసద్దులే ఉండవు. సరదాగా కార్లలో పబ్బులకు, క్లబ్బులకు కలసి తిరుగుతారు. వారాంతంలో దూర తీరాల విహార యాత్రలకు వెళతారు. విందు, వినోదాల్లో తేలిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితాలు స్వర్గతుల్యం. ఇది బయటకు కనిపంచే ప్రపంచం. ఇదంతా ఒట్టి భ్రమ. సిలికాన్‌ వ్యాలీలో దక్షిణాసియాకు చెందిన, ముఖ్యంగా భారతీయ పురుష పుంగవులు ఇలాంటి ఆనంద డోలికల్లో తేలిపోతున్నారేమో తెలియదుగాని, వారి భార్యలు మాత్రం భయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. గహ హింసలో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.





భారత్‌లోని ఐఐటీలో ట్యాప్‌ రాంకర్‌గా వచ్చి సిలికాన్‌ వ్యాలీలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభిషేక్‌ గట్టానిపై ఆయన భార్య నేహా రస్తోగి గహ హింస కేసు పెట్టడంతో ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా వెలుగు చూశాయి. భర్త తనను హింసిస్తున్న విషయాన్ని ఆమె ఐఫోన్‌లో రికార్డు చేసి, దాన్ని కాలిఫోర్నియా కోర్టులో వినిపించడంతో ఈ వారమే ఆయనకు కోర్టు, నెల రోజుల జైలు శిక్ష విధించింది. మిత్రులతో సహోద్యోగులతో సౌమ్యంగా మెలిగే అభిషేక్‌ ప్రవర్తన గురించి తెలిసి సిలికాన్‌ వ్యాలీ నివ్వెరపోయింది.



పెళ్లయినా కొత్తలో...ఆ తర్వాత

ఐటీ రంగంలోనే ఉన్నత ఉద్యోగం చేస్తున్న రస్తోగి కథనం ప్రకారం పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ ఆనందంగానే ఉండేవారు. రానురాను ఇద్దరు కలసి బయటకు వెళ్లడం తగ్గింది. ఆ తర్వాత ఆఫీసుకు తప్ప బయటకు ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదనే ఆంక్షలు భార్యపై మొదలయ్యాయి. చెంప దెబ్బలతో మొదలైన గహ హింస చితకబాదే వరకు వెళ్లింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పిల్లలు కావాలను అభిషేక్‌ డిమాండ్‌ చేయడంతో అప్పటికే మూడుసార్లు గర్భస్రావంమైన రస్తోగి మందుల వాడడం ద్వారా ఇద్దరు ఆడపిల్లలను తల్లయ్యింది. గహ హింసా ఇంకా పెరిగింది. పిల్లలను ఏమత్రం దగ్గరికి తీయడంగానీ, వారికి సంబంధించిన పనులుగానీ చేసే వాడు కాదు భర్త. పైగా పిల్లలను విసుక్కునే వాడు. బయటే ఎక్కువ కాలం గడిపేవాడు. ఇంటికొస్తే భార్యను కొట్టడమే పనిగా పెట్టుకునే వాడు.



ఎలాంటి గహ హింస ఉంటుంది?

దక్షిణాసియాలో గహ హింసకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అమెరికాలో మైత్రి, నారికా అనే రెండు సంస్థలు కషి చేస్తున్నాయి. ఈ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం భర్తలు తీసుకెళ్లకుండా భార్యలు బయటకు రాకూడదు. షాపింగ్‌లకు కూడా వెళ్లకూడదు. భార్య మొబైల్‌లోని నెంబర్లను, మెస్సేజ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌లను చూస్తారు. ఈ నెంబర్లు ఎవరివీ, ఈ మిస్సేజ్‌లు ఎవరివంటూ అనవసర అనుమానాలతో వేధిస్తారు. రానురాను గొడవలు పెరుగుతాయి. చెంప దెబ్బల నుంచి చెప్పు దెబ్బల వరకు గహ హింస వెళుతుంది.  కొందరు భార్యల ఉద్యోగాలు మాన్పిస్తారు. వారిని ఇంట్లోనే బంధీ చేస్తారు. పిల్లలు పుడితే వారి బాగోగుల సంగతి భార్యలకే వదిలేస్తారు. పట్టించుకోరు, ప్రశ్నిస్తే మళ్లీ హింస...అత్తామామలతో ఉండే కోడళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.



పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయరు?

గహ హింస ఎదుర్కొంటున్న మహిళలు అమెరికా పోలీసులు అత్యవసర సేవలు అందించే 911కు ఫోన్‌ చేయవచ్చు. వాళ్లు వెంటనే స్పందిస్తారు. భర్తలపై గహ హింస కేసు పెడితే వెంటనే భర్తల ఉద్యోగాలు పోతాయి. వారి నుంచి ఇంకా దారుణాలను ఎదుర్కోవాలసి వస్తుందన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. డిపెండెంట్‌ వీసాలపై వచ్చిన భార్యల పరిస్థితి ఇంకా దారుణం. హెచ్‌–1బీ కలిగిన భర్తలను వదిలేస్తే భార్యల డిపెండెంట్‌ వీసాలు రద్దవుతాయి. ఉద్యోగాలు పోతాయి. భారత్‌కు రావాల్సి వస్తుంది. వచ్చినా ఫర్వాలేదనుకుంటే అక్కడే పుట్టినందున వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఉంటుంది. వారిని తెచ్చుకోవడానికి తల్లులకు హక్కు లేదు. అందుకే వారు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయరు.



70 శాతం కేసులు ఐటీ నుంచే...

ఇలాంటి పరిస్థితులలోనే గహి హింస నుంచి మహిళలను రక్షించేందుకు తాము రంగంలోకి దిగామని మైత్రి, నారికాలు తెలిపాయి. ఒక్క 2016లోనే తమకు 4,330 మంది మహిళల నుంచి ఫిర్యాదులందాయని మైత్రి తెలిపింది. 2013లో అందిన ఫిర్యాదులతో పోలిస్తే ఇవి రెండింతలట. ఏడాదికి తమకు దాదాపు 1200 ఫిర్యాదులు అందుతాయని నారికా వెల్లడించింది. అందులో 65 నుంచి 70 శాతం ఐటీ రంగానికి చెందిన మహిళలే ఉంటున్నారని పేర్కొంది. భార్యా భర్తలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతోపాటు ఇటు అమెరికా, అటు భారత్‌ చట్టాలను దష్టిలో పెట్టుకొని తాము పరిష్కార మార్గాలు సూచిస్తున్నామని చెప్పారు.



రస్తోగి సూచిస్తున్న చిట్కాలు...

మగవారి గహ హింస నుంచి బయట పడాలంటే సంయుక్తంగా బ్యాంక్‌ ఖాతా తెరవకూడదు. ఇద్దరి ఖాతాలు వేర్వేరుగా ఉండడమే మంచిది. వ్యక్తిగత స్వేచ్ఛను ముందునుంచే కాపాడుకోవాలి. పిల్లలను అసలు కనకూడదని అమె చెబుతున్నారు. అమెరికాలో నివసించే పాశ్చాత్య, యూరప్‌ దేశాల భార్యా భర్తలో ఈ గహ హింస లేదని, భారత్‌ లాంటి దక్షిణాసియా దేశాల కుటుంబాల్లోనే ఈ హింస ఎక్కువగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అందుకు వారి సంస్కతే కారణమని, విడుకులు తీసుకోవడంలో వారికున్న స్వేచ్ఛ మనకు లేదని వారంటున్నారు. పాశ్చాత్య సంస్కతి మోజులో పడే మగవాళ్లు, ఆ సంస్కతికి భార్యలను దూరంగా ఉంచాలనుకోవడం వల్ల కూడా భార్యాభర్తల్లో సమస్యలొస్తున్నాయని, అది గహ హింసకు దారితీస్తోందని వారు చెబుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top