'మా సర్కారుకు దేవుడి సాయం ఉంది'

'మా సర్కారుకు దేవుడి సాయం ఉంది'


తమ వందరోజుల పాలనాకాలంలో తాను ముందుగా చెప్పిన పనులన్నింటినీ చేశానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు దేవుడి సాయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఆయన 'బహిరంగ కేబినెట్ సమావేశం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..


  • దేవుడి సాయం లేకుండా మా పార్టీకి అసెంబ్లీలో 67 సీట్లు రావు.

  • నేను ముందు చెప్పిన పనులన్నీ చేశాను. కరెంటు బిల్లులు తగ్గాయి.

  • మా మంత్రులందరూ తమ తమ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు. మీరు ప్రశ్నలు వేయండి, సలహాలు ఇవ్వండి.

  • అంతకంటే ముందుగా నేను ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మీ అందరికీ చెప్పాలి.

  • ఢిల్లీ రాష్ట్రంలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే.. వాళ్లపై ఢిల్లీ ఏసీబీ దర్యాప్తు చేస్తుందని గతంలో ఉన్న చట్టంలో చెప్పారు.

  • గతంలో మా సర్కారు వచ్చినప్పుడు ఈ దేశంలోనే అతిపెద్ద వ్యక్తి ముఖేష్ అంబానీ మీద కేసు పెట్టాం.

  • మా ప్రభుత్వం పడిపోగానే.. బీజేపీ సర్కారు ఢిల్లీ ఏసీబీ కేవలం ఢిల్లీ సర్కారు ఉద్యోగుల అవినీతినే చూస్తుందని, పోలీసులు అవినీతిని పట్టించుకోకూడదని చెప్పింది.

  • కానీ హైకోర్టు ఈరోజు ఇచ్చిన ఆదేశాలు చూడండి.

  • కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీలో వేలుపెట్టే అధికారం లేదని హైకోర్టు చెప్పింది.

  • దాంతో మాకు కొండంత బలం వచ్చింది.

  • పొద్దున్న మా ఇంటికి పెద్ద న్యాయవాది వచ్చారు. మీకు దేవుడు అందించిన శక్తి మేలుచేస్తుందని ఆయన చెప్పారు. భగవంతుడే తోడుండగా.. మీరు దేనికీ భయపడక్కర్లేదన్నారు.

  • మేం ప్రధానంగా కరెంటు, నీళ్లు, విద్య, మహిళల భద్రత, అనధికార కాలనీలు, అవినీతి నిరోధం, ట్రాఫిక్, ధరలు, కాలుష్యం.. ఇలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాం.

  • ప్రజలకు సుపరిపాలన అందించాలని కంకణం కట్టుకున్నాం. ఆ దిశగా మా మంత్రులు ఏం చేశారో మీకు చెబుతారు.

  • మీ ప్రశ్నలు, సూచనలు చెప్పండి.. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్కో శాఖకు 15 నిమిషాలు మాత్రమే కేటాయించగలం.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top