షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే!

షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే! - Sakshi


ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను మలేషియాలోని విమానాశ్రయంలో దారుణంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది. అనూహ్యరీతిలో ఒక మహిళ నామ్‌పై వెనుక నుంచి దాడిచేసి.. ముఖానికి వేగంగా పనిచేసే విషాన్ని పూయడంతో ఆయన చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెల్లని దుస్తులు ధరించిన మహిళ వెనుక నుంచి నామ్‌ ముఖాన్ని పట్టుకొని.. ఏదో పూస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను జపాన్‌కు చెందిన ఫుజి టీవీ విడుదల చేసింది. నామ్‌పై దాడి దృశ్యాలను ఎయిర్‌పోర్టు సీసీ టీవీ కెమెరాలు రెండు కోణాలలో చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తున్నది.

దాడి చేసిన వెంటనే ఆ మహిళ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపిస్తున్నది.  మహిళ దాడితో తడబడుతూ.. తన ముఖాన్ని తుడుచుకుంటూ నామ్‌ అక్కడి నుంచి కదిలి పోలీసుల సహకారం తీసుకున్నాడు. అనంతరం విమానాశ్రయంలో ఉన్న చికిత్ర కేంద్రానికి వెళ్లాడని ఈ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, మహిళలు తన ముఖానికి ఏదో ద్రవాన్ని పూశారని దాడి తర్వాత నామ్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని పోలీసులు ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. మకావ్‌ వెళ్లేందుకు గత సోమవారం కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో కిమ్‌ జాంగ్‌ నామ్‌పై మహిళలు విషప్రయోగంతో దాడి చేశారు. నాటకీయ ఫక్కీలో జరిగిన ఆయన హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణ​కొరియా తెలిపింది. కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ సాక్షిగా జరిగిన ఈ హత్యతో ఉత్తరకొరియా-మలేషియా మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రస్తాయికి చేరాయి.

 

ఈ హత్య కేసులో ఒక ఉత్తర కొరియా మహిళను అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్‌ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది.

నామ్‌ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్‌ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్‌ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్‌ జోంగ్‌-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే  నామ్‌ను మహిళతో కిమ్‌ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top