ఉత్తరాఖండ్‌లో వర్చువల్‌ పోలీస్‌ స్టేషన్‌


గోపేశ్వర్‌ : ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదును స్వీకరించే వర్చువల్‌ పోలీస్‌స్టేషన్‌(వీపీఎస్‌)ను ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎంఏ గణపతి ప్రారంభించారు. ప్రమాదం సంభవించినప్పుడు బాధితులు ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా వీపీఎస్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ వీపీఎస్‌కు లోకల్‌ నోటిఫికేషన్‌ యూనిట్‌ చీఫ్‌ మనోజ్‌ అశ్వాల్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.



రాష్ట్ర భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఈ తరహా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు వల్ల ఫిర్యాదును స్వీకరించడంతో పాటు వేగంగా బాధితులకు సాయమందించడం వీలవుతుందని గణపతి అభిప్రాయపడ్డారు. ఉత్తరఖండ్‌లోనే తొలి వీపీఎస్‌గా గుర్తింపు పొందిన ఈ వ్యవస్థ వల్ల మారుమూల గ్రామాల్లోని ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top