ఒక్కరికి పది మంది భాగస్వాములు

ఒక్కరికి పది మంది భాగస్వాములు - Sakshi


లండన్: అబ్బో! ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్ అంటారు పెద్దలు. ఎంత ఫాస్టో తెలుసుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ‘శ్యామ్‌సంగ్’ నిర్వహించిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాతికేళ్ల వారిని, యాభై ఏళ్లు దాటిన వారిని రెండు వేర్వేరు క్యాటగిరీల కింద విభజించి వారి అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.



పెళ్లికి ముందు పాతికేళ్ల వారికి పది మంది సెక్సువల్ పార్టనర్స్ ఉండగా, యాభై ఏళ్లు దాటిన వారికి పెళ్లికి ముందు ఐదుగురు భాగస్వాములకు మించి లేరట. యాభై ఏళ్లు దాటిన వారిలో ఐదింట రెండు వంతుల మంది తమ తొలి సెక్సువల్ పార్టనర్‌ను పెళ్లి చేసుకోగా, పాతికేళ్ల వారు ఐదుగురిలో ఒకరు మాత్రమే తొలి లైంగిక భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఏడుగురు యువకుల్లో ఒకరు మాత్రం 20 మందికిపైగా సెక్సువల్ పార్టనర్స్‌ను కలిగి ఉండగా, యాభై ఏళ్లు దాటిన వారిలో మూడు శాతం మందికే ఎక్కువ భాగస్వాములను కలిగి ఉన్నారు.



పెళ్లికి ముందు సెక్సు సంబంధాలు కలిగిన పెద్దల్లో కేవలం నాలుగు సంబంధాలను మాత్రమే ఎక్కువ రోజులు కొనసాగించారు. పాతికేళ్ల వారు మాత్రం కనీసం ఆరు సంబంధాలను దీర్ఘకాలిక ప్రాతిపదికపై కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇక సొంతింటి విషయానికొస్తే పెద్దల్లో 78 శాతం మంది సొంతింట్లో నివసిస్తుండగా, యువకుల్లో కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే సొంతింట్లో నివసిస్తున్నారు. వారిలో 40 శాతం మంది యువకులు తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నారు. పెద్ద వాళ్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఆరుసార్లు మాత్రమే మారగ, యువకులు 14 సార్లు మారారు.



పెద్దవాళ్లు గరిష్టంగా పది దేశాలను సందర్శిస్తే, యువకులు తమ జీవితకాలంలో 16 దేశాలైనా తిరగాలని కోరుకుంటున్నారు. అలాగే యువకుల్లో 68 శాతం మంది విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పెద్దవాళ్లు సరాసరిన 33 మంది స్నేహితులను కలిగిఉండగా, యువకులు మాత్రం సరాసరి 113 మంది స్నేహితులను కలిగి ఉన్నారు. సామాజిక వెబ్‌సైట్ల ద్వారా ఎక్కువ మంది స్నేహితులను కలిగిన యువకుల్లో ఎక్కువ మంది మధ్యలోనే ఆ స్నేహ సంబంధాలను వదులుకుంటున్నారు. పెద్దలు 15 మందిని జీవితకాలం స్నేహితులను కలిగి ఉండగా, యువకుల్లో  ఏడుగురికి మించి కలిగి ఉండే అవకాశాలు కనిపించడం లేదు.



మొత్తంగా జీవితంలో పెళ్లి చేసుకొని సెటిలయ్యేందుకు సెక్సువల్ పార్టనర్స్, ఉద్యోగాలు, ఇళ్లు, ఉంటున్న ఊరును మార్చేందుకు యువకుల్లో నూటికి తొంభైతొమ్మిది శాతం యువకులు సిద్ధంగా ఉన్నారని.. వారు ఎప్పుడూ మార్పును కోరుకుంటున్నారని బ్రిటన్‌లోని శ్యామ్‌సంగ్ ఐటీ అండ్ మొబైల్ ఉపాధ్యక్షుడు కోనర్ పియెర్స్ తెలిపారు. యువకులు సరదా షాపింగ్ మినహా అవసరమైన షాపింగ్ కోసం ఎక్కువగా మొబైల్స్‌పైనే ఆధారపడుతున్నారని ఆయన చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top