కోటిన్నర బోనస్.. వీడేరా బాస్!

కోటిన్నర బోనస్.. వీడేరా బాస్!


చాలా కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడం  చూశాం.. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం (రెసిషన్)  కొనసాగుతున్నా కూడా క్రమం తప్పకుండా బోనస్ లు ఇచ్చిన బాస్లనూ చూశాం. పండగలకు, పబ్బాలకు స్వీట్  డబ్బాలు పంచి ఇవ్వడం  చూశాం.... కానీ ఏకంగా   కోటిన్నర రూపాయల బోనస్ ఇచ్చిన బాస్ను ఎక్కడైనా చూశారా?





సాధారణంగా యజమానులు  ఇచ్చే  చిన్నా చితకా కానులకలతోనే  సంబరాలు చేసుకునే ఉద్యోగులు  చాలామందే ఉన్నారు. అలాంటి వారికి ఏకంగా కోటిన్నర బోనస్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతు లేస్తారు. కలా!  నిజమా, అని  గిచ్చుకుని చూసుకుంటారు కదా. సరిగ్గా టర్కీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులు కూడా ఇలాగే  ఆనందంతో కేకలు పెట్టారట... కేరింతలు కొట్టారట. సంతోషం పట్టలేక ఆనంద  బాష్పాలు రాల్చారట.  బాస్ను  పొగడ్తలతో  ముంచేస్తూ ఉత్తరాలు రాశారట.  ఈ ప్రపంచంలో మా బాస్ అంతటి గొప్ప యజమాని ఇంకెవరున్నారు చెప్పండంటూ మురిసిపోతున్నారట.



టర్కీకి  చెందిన  ఆన్లైన్ కంపెనీ యేమేక్సెపేత్  అధిపతి నెవ్జాట్ అద్విన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సర్వీస్ రంగంలో సేవలందిస్తున్న తమ కంపెనీ విజయానికి, లాభాలకు  కారణం ఉద్యోగులేనని పేర్కొన్నారు. అందుకే తమ లాభాలను వారికి పంచి ఇవ్వాలని నిర్ణయించానని తెలిపారు.  2000 సంవత్సరంలో యాభై లక్షలతో స్థాపించిన తమ సంస్థ  అనేక మైలు రాళ్లను  అధిగమించడానికి కారణం ఉద్యోగులేనన్నారు.




జర్మనీ చెందిన మార్కెట్  దిగ్గజం డెలివరీ హీరో కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 3 75 మిలియన్ పౌండ్ల విలువైన ఈ ఒప్పందంతో తమ కంపెనీ ప్రతిష్ట మరింత పెరిగిందని  ఆయన వెల్లడించారు.   అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఒప్పందానికి ముందే ఆయన ఈ బోనస్ ప్రకటించారు. ఆ తరువాత పేరెంటల్ కంపెనీ డెలీవరీ  హీరో దాన్ని యథాతథంగా అంగీకరించింది.

తన  ప్రకటన వినగానే   ఉద్యోగులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారన్నారు.  తామిచ్చే బోనస్తో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top