మెగా మూవీపై క్లారిటీ ఇచ్చిన టీఎస్‌ఆర్‌

‘చిరు-పవన్‌’ సినిమా పక్కా - Sakshi


- మెగా మూవీపై క్లారిటీ ఇచ్చిన టీఎస్‌ఆర్‌

హైదరాబాద్‌:
మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లు హీరోలు తాను నిర్మించబోయే మెగా మూవీపై నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి(టీఎస్‌ఆర్‌) స్పష్టత ఇచ్చారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలోనే పక్కాగా సినిమా ఉంటుందని సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిరింజీవి, పవన్‌ కల్యాణ్‌లు ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారని, అవి పూర్తయిన మరుక్షణంలోనే మెగా మూవీ ప్రారంభిస్తామని టీఎస్‌ఆర్‌ పేర్కొన్నారు.



గ్రాండ్‌గా తెరకెక్కనున్న ఈ మెగా మూవీ తెలుగుసినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని నిర్మాత టీఎస్‌ఆర్‌ తెలిపారు. కాగా, ఈ సినిమాకు కథ రెడీ అయిందని ప్రముఖ సినీవిశ్లేషకుడు రమేశ్‌ బాలా కొద్ది గంటల కిందటే వెల్లడించారు. పవన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమాకు తోడు మరో మూవీకీ కమిట్‌ అయ్యారు. ఖైదీ 150 హిట్‌తో ఊపుమీదున్న చిరు ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ కి పచ్చజెండా ఊపారు. ఇంకా షూటింగ్‌ ప్రారంభంకాని ‘ఉయ్యాలవాడ’ పూర్తయిన వెంటనే చిరు చేయబోయే సినిమా టీఎస్‌ఆర్‌దే.



చిరు, పవన్‌లు ఇద్దరూ రాజకీయనాయకులే కావడంతో కమిటైన సినిమాలు పూర్తయ్యేసరికి ఎన్నికలు ముంచుకొస్తే పరిస్థితి ఏమిటనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినాసరే, ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా చేస్తానని నిర్మాత ప్రకటించడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top