‘కృష్ణా’పై పునఃపరిశీలన అవసరం

‘కృష్ణా’పై పునఃపరిశీలన అవసరం - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయిం పుపై తెలంగాణ రాష్ట్రం వాదనలను ఇంకా వినా ల్సి ఉందని.. ఈ నేపథ్యంలో నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ పునఃపరిశీలించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. కృష్ణా నదీ జలాల పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు(తీర్పు)ను గెజి ట్‌లో ప్రచురించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తుది అవార్డును నోటిఫై చేయాలన్న మహారాష్ట్ర వాదనలపై 4 వారాల్లో అభిప్రాయం తెలపాలని ఆదేశిస్తూ కేంద్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.




 టిబ్యునల్ తుది అవార్డును అమలు చేయాలని ఇప్పటికే కర్ణాటక అభ్యర్థించగా.. ఏపీ, తెలంగా ణ ఈ అవార్డును వ్యతిరేకిస్తున్నాయి. కృష్ణా జ లాల కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో అవార్డు ప్రకటించగా.. రా ష్ట్రాలు అభ్యంతరాలు లేవనెత్తడంతో పలు వివరణలు ఇస్తూ 2013లో తుది అవార్డు ప్రకటిం చింది. ఈ అవార్డును గెజిట్‌లో ప్రచురించరాద ని కోరుతూ 2010లో సుప్రీం కోర్టును ఏపీ ఆశ్ర యించడంతో, తాము చెప్పేంతవరకు ప్రకటించ రాదంటూ స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కేసును శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.




 విడిగా వాదనలు వినిపిస్తాం..




 విచారణ ప్రారంభం కాగానే తొలుత చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోథా మాట్లాడుతూ ‘రాష్ట్రపునర్ వ్యవస్థీకరణ అనంతరం తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో వేర్వేరుగా వాదనలు వినిపిస్తాయా లేక ఒకటిగా వినిపిస్తా యా చూడాలి.. లేదంటే ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్-3 ఏర్పాటుకావాల్సి ఉంటుందేమో’ అని ఛలోక్తి విసిరారు. దీనిపై కర్ణాటక తరపు న్యాయవాది అనిల్ దివాన్ స్పందిస్తూ.. ‘ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రతివాది-1గా ఉన్నందున.. ఇకపై ఏపీని 1ఏ, తెలంగాణను 1బీగా వ్యవహరిస్తే సరిపోతుంది’ అని పేర్కొన్నారు. అన్ని కేసుల్లో విడిగా తాము వాదనలు వినిపిస్తామని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ తేల్చిచెప్పారు. ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్.. ‘మీకు రాష్ట్ర ఏర్పాటు ద్వారా న్యాయం జరిగింది కదా’ అని వ్యాఖ్యానించారు. దీనికి వైద్యనాథన్ స్పందిస్తూ ‘మా ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోవాల్సి ఉంది.  

 

 ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులు జరపాలని.. అందుకోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ కసరత్తు చేయాల్సి ఉందని లోథా ప్రశ్నించారు. జగడం ఆ రెండు రాష్ట్రాల మధ్యే ఉందని కర్ణాటక తరఫు న్యాయవాది అనిల్ దివాన్ అన్నారు. అనంతరం మహారాష్ట్ర తరపు న్యాయవాది అం ధ్యార్జున వాదనలు వినిపిస్తూ.. ‘బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించిన ఇన్నేళ్ల తరువాత కూడా దాన్ని నోటిఫై చేయకపోతే ఎలా? ఇప్పుడేమో పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఆధారం గా ట్రిబ్యునల్ కాలపరిమితిని రెండేళ్లు పొడిగిం చారు. వివాదం కొత్త రాష్ట్రాల మధ్యే ఉంది. అ వార్డును గెజిట్‌లో ప్రచురించాలి’ అని పేర్కొన్నా రు. ఈ సమయంలోనే తెలంగాణ వాదనలు వినాల్సి ఉంది కదా అని చీఫ్ జస్టిస్ మరోసారి అన్నారు.  ‘పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 స్పష్టంగా లేనట్టుంది. దాని పరిధి ఏంటన్న అంశంపై అందరూ ఒక స్పష్టతకు రావాల్సి ఉం టుంది’ అని జస్టిస్ నారీమన్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ తీర్పును ప్రశ్నించే అధికారం ఏ కోర్టుకూ లేదని.. ఇక ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి ప్రయోజనం ఏంటి? అని మహారాష్ట్ర తరఫు న్యాయవాది అన్నారు. అనంతరం ఈ కేసుల్లో తెలంగాణ ఇంప్లీడ్ అయ్యేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది.

 

 మొత్తం 4 పిటిషన్లు..




 ఈ కేసులో నాలుగు ప్రధాన పిటిషన్లు ఉన్నాయి. ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డును తొలిసారి వ్యతిరేకించిన కేసు కాగా, రెండో ది.. అవార్డును త్వరితగతిన నోటిఫై చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు. ఇక మూడోది ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్. దీంతోపాటు తుది తీర్పులో 65 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపుల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని ఈ ఏడాది జనవరిలో ఏపీ ప్రభు త్వం వేసిన మరో పిటిషన్ కూడా ఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top