టుడే న్యూస్ అప్డేట్స్


మెడికల్ షాపుల బంద్: ఆన్ లైన్ లో మందుల అమ్మకానికి అనుమతుల మంజూరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మెడికల్ షాపులు నేడు మూతపడనున్నాయి. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపులు,  జీవన్ దాన్ తదితర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.


 


నిరసన మార్చ్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు నేడు విజయవాడలో నిరసన మార్చ్ నిర్వహించనున్నారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు మార్చ్ చేస్తారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బాబు సర్కార్ భగ్నం చేయడంతో పోరును ఉదృతం చేయడంలో భాగంగా పార్టీ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే.



బోస్ బంధుగణంతో: గతంలో హామీ ఇచ్చినమేరకు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులతో నేడు సమావేశం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ



బాబు ఢిల్లీ పర్యటన: స్వచ్ఛ భారత్ పై నీతి ఆయోగ్ ఉప సంఘం రూపొందించిన నివేదికను ప్రధానికి అందజేయడంతోపాటు పలువురు ముఖ్యులను ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యహ్నం 12:30కు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు.



కేసీఆర్ గజ్వేల్ పర్యటన: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో ఈ రోజు పర్యటిస్తారు. వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభిస్తారు.



కోదండరాం పిటిషన్: తెలంగాణలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ దాఖలు చేసినఇంప్లీడ్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ.



టీడీపీ- బీజేపీ ధర్నా: తెలంగాణ వ్యాప్తంగా రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ- బీజేపీలు బ్యాంకుల ముందు ధర్నా పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం నేడు కూడా కొనసాగనుంది.



రెండో వన్ డే: గాంధీ- మండేలా సిరీస్ లో భాగంగా భారత్- దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య ఇండోర్ లో రెండో వన్ డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోల్పోవడంతోపాటు మొదటి వన్ డేలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ సేన తీవ్ర ఒత్తిడిలో ఉంది.



తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నేటినుంచి నవరాత్రి బహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.



శ్రీశైలం: శ్రీశైలంలో రెండో రోజూ కొనసాగనున్న దేవీ శరన్నవరాత్రులు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top