టుడే న్యూస్‌ రౌండప్‌






సాక్షి, హైదరాబాద్‌:
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. నేషనల్‌ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున జరుపుతున్న భూ సేకరణపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది. మరోవైపు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇక నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ‘పచ్చ’ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. తెలంగాణ విషయానికి వస్తే శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌గా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి మీకోసం..



<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


హైకోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు అయింది. నేషనల్‌ హైవే అథార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున జరుపుతున్న భూ సేకరణపై న్యాయస్థానం గురువారం స్టే విధించింది.


కాకినాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.


పవన్‌ కల్యాణ్‌ ప్రకటన శుభ పరిణామం..

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ‘పచ్చ’ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.


లౌక్యంగా ఓటు.. దుర్మార్గపు పాలనపై వేటు

రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, దానికి నంద్యాల నాంది కావాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.


'తెలంగాణ పోలీసులు నెంబర్‌వన్‌'

శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌గా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.


రోడ్‌ షోలో డబ్బులు పంచిన బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు.


<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


ప్రతి భారతీయుడూ తెల్సుకోవాల్సిన నిజాలు

డొక్లాం సమస్యపై చైనా అధికారిక మీడియా 'భారత్‌ చేసిన ఏడు పాపాలు' అంటూ వీడియో విడుదల చేసింది.


భారత్‌పై చైనా విద్వేషపూరిత వీడియో

భారత్‌ ఏడు పాపాలు చేసిందంటూ చైనా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది.


మళ్లీ విధుల్లోకి ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్‌

ఆ పోలీస్‌ అధికారి వయసు 55 ఏళ్లు.. పాతికేళ్ల సర్వీస్‌. 100 ఎన్‌కౌంటర్లలో 113 మంది గ్యాంగ్‌స్టర్లను ఏరివేశారు.


ముస్లింలు అక్కడ నమాజ్‌ చేయొద్దు: యోగి

రోడ్లపై నమాజ్‌ చేయొద్దని ముస్లింలను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు.


<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>


లండన్‌లో తొలి లెస్బియన్‌ వివాహం

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇందులో కొత్తేం ఉంది అనుకుంటున్నారా.. కానీ వీరు పెళ్లి చేసుకుంది లండన్‌లో.


మెల్‌బోర్న్‌ మరో ఘనత

ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఎంపికైంది.


భారత్‌-చైనాల మధ్య యుద్ధం: ఫారెన్‌ మీడియా

భారత్‌, చైనాల మధ్య తలెత్తిన డొక్లాం వివాదం ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని విదేశీ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.


<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>


ఇన్ఫోసిస్‌ షేర్లకు బైబ్యాకు జోరు

ఐటీ కంపెనీల షేర్లు ఓ వైపు ఒత్తిడిలో కొనసాగుతుండగా.. టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు మాత్రం గురువారం ట్రేడింగ్‌లో దూసుకుపోతున్నాయి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ లెండర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా సేవింగ్స్‌ అకౌంట్‌ డిపాజిట్ల వడ్డీరేట్లకు కోత పెట్టింది.


ఆపిల్‌ ఐ ఫోన్‌తో పోటీ.. మాకు మేమే సాటి

ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి దిగ్గజ కంపెనీలను నిలువరించి మార్కెట్‌లో రారాజుగా వెలిగేందుకు మళ్లీ రంగంలోకి వచ్చిన నోకియా తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ నోకియా 8ను బుధవారం లాంచ్‌ చేసింది.


కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా?

కొత్త ఆపరేటర్లు మార్కెట్‌లోకి ఎంట్రీ, డిజిటల్‌ వాలెట్ల ప్రవేశం, స్మార్ట్‌ఫోన్‌కు రోజురోజుకు పాపులారిటీ పెరగడం, టె​క్నాలజీకి మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్‌ ఏర్పడటం... టెలికాం రంగంలో కొత్తకొత్త ఉద్యోగవకాశాలకు నాంది పలుకుతోంది.


<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>


ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పలువురు మాజీ ఆటగాళ్ల బాటలో నడవబోతున్నాడు.


'నన్ను కోచ్ దూషించాడు'

తనను క్రికెట్ కోచ్ మైక్ ఆర్థర్ తీవ్రంగా దూషించాడంటూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపిస్తున్నాడు.


'అతని బ్యాటింగ్ అంతా కలలా ఉంది'

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.


<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>


బిగ్‌బాస్‌ షోలో మరో హీరోయిన్‌ ఎంట్రీ..

తెలుగు బిగ్‌బాస్‌షో కొత్త సినిమాలకు ప్రచార వేదిక అవుతోంది.


హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో 'వివేగం'

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వివేగం.


ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.


ఓవర్‑సీస్‑లో భారీగా 'ఆనందో బ్రహ్మా'

తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కి.. తొలి ట్రైలర్ నుంచి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కామెడీ హర్రర్ మూవీ ఆనందో బ్రహ్మా.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top