టుడే న్యూస్‌ రౌండప్‌


హైదరాబాద్‌: చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి స్పందించారు. ఇక భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పనిచేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. క్రీడల విషయానికి వస్తే భారత్‌ మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు చాముండేశ్వరీ నాథ్‌ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయనున్నారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కుమారుడు కూడా చేరిపోయాడు. ఈరోజు జరిగిన ముఖ్య వార్తలు మీకోసం..



<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>



పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్‌..

చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు.



కంపెనీ ఉందని నిరూపిస్తే రాసిస్తా: కేటీఆర్‌

తనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.



చార్మి పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

డ్రగ్స్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్‌ చార్మికి స్వల్ప ఊరట లభించింది.



‘తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..’

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.



రేకింగ్‌: వారు ఏమైనా టెర్రరిస్టులా?

పోలీసులు ఏ చట్టపరిధిలో వ్యవహరిస్తున్నారో డీజీపీ చెప్పాలి.. చట్టాలను ప్రభుత్వం గౌరవించదా..?


<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>


ప్రధాని మోదీపై అభ్యంతరకర వీడియో.. కలకలం

ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది.



14వ రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం

దేశ 14వ రాష్ట్రపతిగా బిహార్‌ మాజీ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.



సందడిలో చావు ఎదురై.. ఓ తండ్రి దురదృష్టం

రాజస్థాన్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తండ్రి శిక్షణ ఇస్తుండగా అది చూస్తున్న కూతురు ప్రమాదవశాత్తు మృత్యువాతపడింది.



ఏచూరికి విజయన్‌ షాక్‌!


 సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడోదఫా రాజ్యసభకు పంపించే విషయమై కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 


<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>



అమెరికాతోనూ పెట్టుకుంటున్న చైనా!

భారత్‌తో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్విన చైనా మరోపక్క, అమెరికాతో కూడ అలాంటి చర్యకే దిగింది. ఏకంగా అమెరికా నిఘా విమానాన్ని అడ్డుకునే చర్యకు దిగింది.



మా అల్లుడు సూపర్‌.. గర్వంగా ఉంది: ట్రంప్‌

తన అల్లుడిని చూసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గర్వంతో ఉప్పొంగిపోతున్నారంట.



దోవల్‌ వస్తే పంచాయితీ పోతుందనుకోకండి: చైనా

ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం చైనాకు ఏమాత్రం లేనట్లుంది. భారత్‌ నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండానే చైనా మీడియా మాత్రం రోజూ ఏదో ఒక ఆర్బాటం చేస్తూనే ఉంది.



'పాక్‌కు నిధులు ఆపేసి మంచిపనిచేశారు'

పాకిస్థాన్‌కు నిధుల సహాయాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా చట్టసభ ప్రతినిధి టెడ్‌ పో సంతోషం వ్యక్తం చేశారు.



<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>



ఆ సినిమాకు సీఎం కేసీఆర్‌....‘ఫిదా’!


‘ఫిదా’ సినిమాలో నటీనటులు చక్కగా నటించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కితాబిచ్చారు.



సహ నటుడి తొడ కొరికాడు...


కన్నడ బుల్లితెర నటులు ప‍్రథమ్‌, భువన్‌ మధ్య చెలరేగిన గొడవ రచ్చకెక్కింది.



సాహోలో మరో బాలీవుడ్ స్టార్


బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో.



భారీ బడ్జెట్‑తో పైసా వసూల్


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పైసా వసూల్.



కోలీవుడ్‑లో సత్తా చాటిన మహేష్..!


సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.



<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>



జియో ఎఫెక్ట్‌: వోడాఫోన్‌ కొత్త ఆఫర్‌


ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్‌ రూ.244 రీచార్జ్‌పై 70 జీబి 4 జీ డేటా అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తోంది.



దలాల్‌స్ట్రీట్‌ రికార్డ్‌: దీపావళి సంబరాలు

దలాల్‌స్ట్రీట్‌ చరిత్ర సృష్టించింది. భారీలాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేసింది.



భారత్‌లోకి జియోనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి జియోనీ ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.



జ్యోతిష్యుల ముందుకు టెకీలు బారులు

సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు న్యూమరాలజిస్ట్‌లను ఆ‍శ్రయిస్తున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.



10వేల మార్కును తాకి, కిందకి దిగింది!


భారీ లాభాలతో దీపావళి సంబురాలు జరుపుకున్న స్టాక్‌ మార్కెట్లు చివరికీ ఫ్లాట్‌గా ముగిశాయి.


<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>


మిథాలీకి బీఎండబ్ల్యూ..

భారత్‌ మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు చాముండేశ్వరీ నాథ్‌ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయనున్నారు.



మేము ఎవరూ ఊహించలేదు:జులన్


మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడి నిరాశపరిచినా మరింత మెరుగ్గా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని పేసర్‌ జులన్‌ గోస్వామి అభిప్రాయపడింది.



మా అబ్బాయి అతనికి పెద్ద అభిమాని: బ్రెట్ లీ


పరుగుల మెషీన్, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి అభిమానుల జాబితాలో ఇప్పుడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కుమారుడు కూడా చేరిపోయాడు.



మంజ్రేకర్... నువ్వు క్రికెట్ ఆడావా?


గత రెండురోజుల క్రితం ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‑లో రన్నరప్ గా నిలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే.. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత సంజయ మంజ్రేకర్ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top