మీ ఏసీ.. మీ వెంటే..

మీ ఏసీ.. మీ వెంటే..


వేసవి మండిపోతోంది కదూ.. ఇంట్లో ఉంటే ఏసీ వేసుకోవచ్చు... కొన్ని ఆఫీసుల్లోనూ ఏసీ సౌకర్యం ఉంటుంది. మరి కరెంటే లేని చోట్ల ఎలా? అవసరమైనప్పుడు ఒక చోటి నుంచి ఇంకోచోటికి తీసుకెళ్లాలంటే? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఫొటోలో కనిపిస్తున్న  ‘జీరో బ్రీజ్‌ ’ అమెరికన్‌ స్టార్టప్‌ ఒకటి తయారు చేస్తున్న ఈ బుల్లి ఏసీ వచ్చే నెలలోనే అందుబాటులోకి రానుంది.



దాదాపు 50 చదరపు అడుగుల గదిని 6 డిగ్రీ సెల్సియస్‌ వరకూ చల్లబరచగలదు. బ్యాటరీతో కూడా పనిచేయగలదు. అంతేకాదు..దీంట్లో శక్తిమంతమైన ఎల్‌ఈడీ లైట్, బ్లూటూత్‌ స్పీకర్, మొబైల్‌ చార్జర్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఫోర్‌ ఇన్‌ వన్‌ అన్నమాట. గత ఏడాది ఈ పోర్టబుల్‌ ఏసీ అభివృద్ధి కోసం కిక్‌స్టార్టర్‌లో నిధుల సేకరణ మొదలుపెట్టగా.. లక్ష డాలర్ల స్థానంలో ఐదు లక్షల కంటే ఎక్కువ మొత్తం వసూలైంది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top