మురికివాడల్లో మొఘలుల వారసురాలు!

మురికివాడల్లో మొఘలుల వారసురాలు!


భారతదేశ చరిత్రలో ఒక మరిచిపోలేని ఘట్ట మొఘల్‌ సామ్రాజ్యం. సువిశాల భారతదేశంలో మొఘల్‌ రాజ్యం ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యంగా కీర్తించబడింది. మొఘల్‌ సామ్రజ్యం కూడా అపార సిరిసంపదలతో తులతూగేది. ప్రతిఏటా 4000 టన్నుల బంగారు అభరాణాలు రాజ్యానికి వచ్చే ఆదాయంలో ఒక భాగం అంటే ఎన్ని లక్షల కోట్ల ఆదాయమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. బాబర్, హుమాయున్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు ఇలా వీరందరూ మొఘల్‌ సామ్రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. మరి ఇంతటి కుబేరులైన మొఘల్‌ వారసులు ఇప్పుడెలా ఉండాలి? వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులతో దర్జాగా బతుకుతుండాలి. కానీ మురికివాడల్లో, పూరి గుడిసెల్లో  బతుకుతున్నారంటే నమ్ముతారా? నమ్మకపోతే ఇది చదవండి...



ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలవుతాయి! అన్నట్లుగానే ఎన్నో సకల సౌకర్యాలు అనుభవించిన మొఘలుల వారసురాలు ఈ రోజు చిన్న పూరిగుడిసెలో బతుకు వెల్లదీస్తోంది. ఔరంగజేబు మనువరాలైన సుల్తనా బేగం కోల్‌కతాలోని చిన్న గదిలో ఆరుగురు పిల్లలతో ఉంటోంది. మొఘలుల చివరి మహరాజు బహదూర్‌ షా జాఫర్‌కు స్వయంగా ఈమె కోడలు. ఈ బహదూర్‌ షా జాçఫర్‌ స్వయాన ఔరంగజేబు మనువడు. అంటే సుల్తానా బేగం ఔరంగజేబుకు మనుమరాలు అవుతుంది. అంటే మొఘల్‌ మహారాణుల్లో సుల్తానా చివరివ్యక్తి అన్నమాట. చివరికి మిగిలింది మహారాణి అన్న బిరుదే కానీ పిడికెడు ఆస్తి కూడా రాలేదు.



బ్రిటిషర్లకు ఎదురు తిరగడంతో.....

బహదూర్‌ షా జాఫర్‌ బ్రిటిషర్లకు ఎదరు తిరిగాడు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఒక వర్గం సైన్యానికి ఈయన నాయకత్వం వహించాడు. బ్రిటిష్‌వారి చేతిలో పరాజయం పాలైన బహదూర్‌ షా ప్రాణభయంతో రంగూన్‌ పారిపోయాడు. ఆ తర్వాత ఇక తిరిగిరాలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం బహదూర్‌ షా ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి ప్యాలెస్‌ దూరమైన ఈయన కుటుంబం రానురాను పేదరికంలోకి వెళ్లిపోయింది.



ప్రభుత్వానికి విన్నవించిన సుల్తానా భేగం..

ఎర్రకోట, తాజ్‌ మహాల్, షాలిమర్‌ గార్డెన్‌లాంటి తమ ఆస్తులను ప్రదర్శనకుపెట్టి ఏటా కోట్ల రూపాయల గడిస్తున్నారు. కానీ తమకు కనీసం బతికేందుకు అవసరమయ్యే ఖర్చులను ప్రభుత్వం కేటాయించడంలేదని సుల్తానా బేగం ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే కోల్‌కతాలో ఒక ప్లాట్, రూ.50,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఖర్చయిపోయాయి. ఫ్లాట్‌ను రౌడీలు కబ్జా చేశారు. దీంతో ప్రస్తుతం పెన్షన్‌గా వచ్చే రూ.6000తో కాలం వెళ్లదీస్తోంది. అయితే కోల్‌కతాలో ఆరువేలతో బతకడం అంటే చాలా కష్టమైన పనే.



గతాన్ని నెమరెసుకుంటూ..

ఒకవేళ బహదూర్‌ షా రంగూన్‌ పారిపోకుండా ఉంటే సుల్తానా భేగం ఢిల్లీలోని జాఫర్‌మహాల్‌లో ఉండేది. కానీ విధి కలిసిరాకపోవడం, ప్రభుత్వాలు స్పందించకపోవడంతో మహారాణిగా బతకాల్సిన సుల్తానా బేగం.. దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది.

– సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top