ఆ లెటర్‌ చూసి తల్లిదండ్రులు దిగ్ర్భాంతి..

ఆ లెటర్‌ చూసి తల్లిదండ్రులు దిగ్ర్భాంతి..


చెన్నై: తమ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తమిళనాడులో జరిగిన సంఘటనే ఉదాహరణ. తక్కువ మార్కులు తెచ్చుకున్న తమ పిల్లలు మంచిగా చదువుకునేందుకు, మార్కులు తెచ్చుకునేందుకు కొట్టినా తిట్టినా ఏమీ అన్నమని తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రంపై సంతకం పెట్టాల్సిన విచిత్ర పరిస్థితి ఇది. వివరాలివీ.. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని కారిమంగళంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఉంది. ఇందులో 500 మంది పైగా బాలికలు చదువుతున్నారు.



కొంతమందికి తక్కువ మార్కులు రావటం ఓ టీచర్‌కు తీవ్ర కోపం తెప్పించింది. అందుకుగాను వారిని దండించాలనుకుంది. ఆ మేరకు తల్లిదండ్రుల నుంచి అనుమతి కోరుతూ సంతకం చేయించుకోని రావాల్సిందిగా ఆ తరగతి బాలికలందరికీ ఒక లెటర్‌ అందజేశారు.  అందులో ఇలా ఉంది.. 11వ తరగతి చదువుతన్న తన కుమార్తె పరీక్షలలో అధిక మార్కులు తెచ్చుకోడానికి ఆమెను ఉపాధ్యాయులు కొట్టడానికి, తిట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. ఆమె తల్లిదండ్రులైన మేము, ఉపాధ్యాయురాలికి అనుమతి ఇస్తున్నాం..’ అని ఉంది.



అందులో సంతకం తీసుకురావాలని విద్యార్థినులకు చెప్పి పంపారు. దీన్ని చూసి దిగ్ర్భాంతి చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు సంబంధిత స్కూలు టీచర్ వద్దకు వెళ్లి అడిగారు. విద్యార్థినులు బాగా చదవడం లేదని, వారిని కొట్టి చదివించడానికి అనుమతి అడిగానని ఆమె చెప్పడం తల్లిదండ్రులను ఆశ్చర్యం కలిగించింది. అయితే విద్యార్థినులంతా తన పిల్లల లాంటి వారేనని, వారి భవిష్యత్తు బాగు కోసమే తాను పాటుపడుతున్నానని ఆమె చెప్పారు. చదువులో గాడి తప్పిన విద్యార్థినులను కొట్టి చదివించడం కోసమే అనుమతి కోరినట్టు ఆ టీచర్‌ తెలపడం గమన్హారం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top