తాలిబాన్ చీఫ్గా ముల్లా అక్తర్
కాబూల్: అఫ్ఘానిస్తాన్ తాలిబాన్ చీఫ్గా ఆ సంస్థ అగ్రనేత ముల్లా అక్తర్ మన్సూర్ నియమితుడయ్యాడు. 2001వ సంవత్సరంలో తాలిబాన్ పాలనలో విమానయాన మంత్రిగా పనిచేసిన అక్తర్.. అఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు మద్దతు పలికాడు.
అంతకుముందు చీఫ్ ముల్లా ఒమర్ మరణించారన్న వార్తలను అక్తర్ నియామకం అయిన కొన్ని గంటల తరువాత తాలిబాన్ ధ్రువీకరిస్తూ గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రెండు వారాల క్రితం ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతడు చనిపోయినట్లు ప్రకటనలో తెలిపింది.