మ్యూజిక్ ఫెస్టివల్ లో లైంగిక అకృత్యాలు!

మ్యూజిక్ ఫెస్టివల్ లో లైంగిక అకృత్యాలు! - Sakshi


స్టాక్ హోమ్: స్వీడన్ లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లైంగిక దాడులకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో 12మంది మహిళలపై లైంగికపరమైన దాడులు జరిగాయని స్థానిక మీడియా తెలిపింది. ఉత్తర స్వీడన్ లోని స్కెల్లెఫ్టీలో గతవారం జరిగిన ట్రాస్టాక్ ఫెస్టివల్ లో కొందరు కామాంధులు లైంగికపరమైన అకృత్యాలకు దిగారు. గత ఏడాది ఈ కార్యక్రమంలో ఒకటే లైంగిక దాడి జరుగగా.. ఈ ఏడాది 12 జరిగాయి.



కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు మహిళలపై దాడులకు దిగారని, స్కర్ట్ వేసుకున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ నేరగాడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో యువతిని కొందరు అసభ్యంగా తాకి.. ఆమె గౌరవానికి భంగం కలిగించారని పోలీసులు చెప్పారు.



నిజానికి ఈ సంగీతోత్సవంలో ఎలాంటి లైంగిక అకృత్యాలు జరగకుండా నిర్వాహకులు కొన్ని చర్యలు తీసుకున్నారు. కాన్సర్ట్ కు వచ్చే మహిళలతో సభ్యతతో మసులుకోవాలంటూ, లైంగికపరమైన దాడులపట్ల అవగాహన కలిగి ఉండాలంటూ ఓ సెమినార్ కూడా నిర్వహించారు. అయినా, ఈ కార్యక్రమంలో యథేచ్ఛగా మహిళలపై దాడులు జరిగాయి. స్వీడిష్ మ్యూజిక్ ఫెస్టివల్ బ్రావెల్లాలో ఇటీవల మహిళలపై 17 లైంగికపరమైన దాడులు జరుగడంతో ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ మ్యూజిక్ బాండ్ మమ్ఫర్డ్స్ అండ్ సన్స్ బహిష్కరించింది. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top