శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ

శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ


సాక్షి, తిరుమల: తిరుమలకు వచ్చే భక్తులందరికీ వంద గ్రాముల బరువు గల లడ్డూను ఉచితంగా ఇవ్వాలని యోచిస్తున్నామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బ్రహ్మోత్సవాల తర్వాత అమల్లోకి తీసుకొస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. కాగా, అక్టోబర్ 3 నుంచి నవంబర్ 15 వరకు శ్రీవారికి నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి 32,759 టికెట్లను ఇంటెర్నెట్ ద్వారా శుక్రవారం ఉదయం 11 నుంచి భక్తులు రిజర్వు చేసుకోవచ్చు.  

 

మూలవిరాట్టుకు బంగారు పాద తొడుగులు:
అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి. రెడ్డి కుమార్తె డాక్టర్ ప్రీతిరెడ్డి కుటుంబ సభ్యులతో కలసి గురువారం శ్రీవారికి బంగారు పాద తొడుగులు కానుకగా సమర్పించారు. గర్భాలయ మూలమూర్తికి వినియోగించాలని దాతలు టీటీడీ జేఈవో కేఎస్. శ్రీనివాసరాజుకు విజ్ఞప్తి చేశారు. 8 కిలోల పైబడి బరువు కలిగిన తొడుగుల విలువ సుమారు రూ. 1.5 కోట్లు ఉంటుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top