దసరా, దీపావళికి 117 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళికి 117 ప్రత్యేక రైళ్లు


సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య 117 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 14 నుంచి నవంబర్ 30 వరకు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.



విశాఖ-సికింద్రాబాద్, కాచిగూడ-షిరిడి, సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖ-తిరుపతి, షిరిడి-కాచిగూడ, తిరుపతి-కాకినాడ, నాంధేడ్-పుణే, కాకినాడ-తిరుపతి, విజయవాడ-విశాఖపట్నం, సికింద్రాబాద్-నాగర్‌సోల్, కాచిగూడ-గుంటూరు, విశాఖ-ధర్మవరం, నాగర్‌సోల్-సికింద్రాబాద్, గుంటూరు-కాచిగూడ, సికింద్రాబాద్-కాకినాడ, కాచిగూడ-గుంటూరు, విశాఖ-విజయవాడ, నర్సాపూర్-తిరుపతి తదితర ప్రాంతాల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top