పాముపిల్లకు జన్మనిచ్చిన మహిళ!

పాముపిల్లకు జన్మనిచ్చిన మహిళ! - Sakshi


కెరమెరి (ఆదిలాబాద్ జిల్లా): సాధారణంగా గర్భంతో ఉన్న స్త్రీలు పాపో...బాబుకో జన్మనిస్తారు. అయితే  ఓ మహిళ పాముకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి(బి) కొలాంగూడలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కవితాబాయి మొదటి కాన్పులో ఓ పాప జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది.



ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో.. అబ్బాయో పుడుతుందని సంబరపడ్డ ఆ దంపతులకు దురాశే మిగిలింది. శనివారం పాము పిల్లకు జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. పాపో...బాబో పుడతారని అనుకుంటున్న తరుణంలో పాము పుట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందని వారు పేర్కొన్నారు.



కవితాబాయికి ఆరో నెలలోనే ...ఎలాంటి నొప్పులు లేకుండా ఇంట్లోనే ప్రసవం జరిగిందని కుటుంబీకులు చెబుతున్నారు. పాము పిల్ల పుట్టిందని, దాన్ని వెంటనే  చంపేసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఖననం చేసినట్లు చెప్పారు. సంఘటన చోటుచేసుకుని ఆరు రోజులు గడుస్తున్నా గ్రామానికి అరిష్టమని భావించి అక్కడి వారు విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. మహిళ  ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో ఉంది.



వైద్యు నిపుణులు ఏమంటున్నారంటే...



సదరు మహిళకు ఆరు నెలల్లోనే ప్రసవం ఇంట్లోనే చేశారు. ఇంత త్వరగా ప్రసవం జరగడంతో గర్భస్త పిండం పూర్తి రూపును సంతరించుకోకపోవడంతో...అది చిన్నపాటి పాములా కనిపించి వుండొచ్చు. గ్రామీణులు కావడంతో ఆ అపరిపూర్ణ పిండాన్ని పాముగా భావించి పూడ్చిపెట్టి ఉండొచ్చని పలువురు వైద్యులు పేర్కొన్నారు.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top