ఆపిల్కు బ్యాడ్ న్యూస్

ఆపిల్కు బ్యాడ్ న్యూస్ - Sakshi

కొత్త కొత్త స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచ్లతో మార్కెట్లను ఏలాలనుకుంటున్న ఆపిల్కు షాకింగ్ న్యూస్ వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో స్మార్ట్వాచ్ల సరుకు రవాణా 51.6 శాతం పడిపోయాయి. వీటిలో ఎక్కువగా ఆపిల్, లెనోవా స్మార్ట్వాచ్ల షిప్మెంట్లే క్షీణించినట్టు తాజా రిపోర్టులు వెల్లడించాయి. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల మూడో త్రైమాసికంలో మొత్తం స్మార్ట్వాచ్ల షిప్మెంట్లు 2.7 మిలియన్ యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5.6 మిలియన్ యూనిట్లగా స్మార్ట్వాచ్ షిప్మెంట్లు రికార్డైన సంగతి తెలిసిందే. సోమవారం ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఈ రిపోర్టు విడుదల చేసింది.  స్మార్ట్వాచ్ వర్తకంలో మార్కెట్ షేర్లో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఆపిల్ స్మార్ట్వాచ్ల షిప్మెంట్ దాదాపు 71.6 శాతం కిందకు దిగజారినట్టు ఈ రిపోర్టు పేర్కొంది.

 

అయితే ఆపిల్ వాచ్ల్లో కొత్త వెర్షన్ , అప్కమింగ్ ఆండ్రాయిడ్ డివైజ్ల కోసం వినియోగదారులు వేచిచూస్తున్నారని, అందుకే కంపెనీ షిప్మెంట్లు పడిపోయినట్టు ఐడీసీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆపిల్ వాచ్ల కొత్త లుక్ను ఆ కంపెనీ విడుదల చేసినప్పటికీ, సెప్టెంబర్ చివరిలో విడుదలైన రెండో తరం వాచ్ల ఆవిష్కరణకూ ఈ న్యూ లుక్ మార్కెట్లోకి అందుబాటులోకి రాకపోవడాన్ని విశ్లేషకులు ఈ క్షీణతకు కారణంగా పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలను గూగుల్ ఆపివేయడం కూడా ఈ తగ్గుదలకు ఓ కారణమే అంటున్నారు. స్మార్ట్వాచ్ల సరుకు రవాణాలో ఆపిల్ క్షీణించినప్పటికీ, మార్కెట్ షేర్లో ఇప్పటికే ఈ కంపెనీ ముందంజలోనే ఉంది. 1.1 మిలియన్ యూనిట్లు విక్రయంతో 41 శాతం మార్కెట్ షేరును సొంతంచేసుకుంది. అయితే స్మార్ట్వాచ్ విక్రయాల గణాంకాలను ఆపిల్ విడుదలచేయలేదు. 6లక్షల విక్రయాలతో గ్రామిన్ రెండో బ్రాండుగా, 14.4 శాతం మార్కెట్ షేరుతో శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top