'కోపం కట్టలు తెంచుకుంది'
లండన్: ఇంటర్నెట్లో ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ సిక్కువిద్యార్థి ఆవేశం కట్టలు తెంచుకున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ వీడియో ప్రకారం తనపై జాతి వివక్షను ప్రదర్శించిన ఓ బ్రిటన్ యువకుడికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నంతలోపే ఆ బ్రిటన్ యువకుడు సిక్కు విద్యార్థిపై దాడి చేశాడు. దీంతో తిరగబడిన ఆయువకుడు తీవ్ర కోపానికి లోనై బ్రిటన్ యువకుడిని కిందపడేశాడు. అనంతరం పిడిగుద్దులు కురిపించాడు. తన్నులు తిన్న అతడు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వెంటపడి మరీ అతడిపై దాడి చేశాడు. చాలా సార్లు సిక్కు విద్యార్థి ఇంగ్లడ్ యువకుడిని ముందుకు తోస్తూ వెనుక నుంచి కొట్టాడు. దీంతో సిక్కు యువకుడి దాడికి తట్టుకోలేని బ్రిటన్ యువకుడు తోక ముడిచాడు.