‘బాహుబలి’ దెబ్బకు మరో వికెట్!

‘బాహుబలి’ దెబ్బకు మరో వికెట్!


న్యూఢిల్లీ: భారీ అంచనాలతో ఘనంగా విడుదలైన ‘బాహుబలి-2’ సినిమా దెబ్బకు మరో వికెట్‌ పడింది. ఇప్పటికే రికార్డు మోత మోగిస్తున్న ఈ సినిమా దెబ్బతో ఢిల్లీలోని ప్రఖ్యాత షీలా థియేటర్‌ ప్రస్థానం ముగిసిపోయింది. 56 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ చారిత్రక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ శుక్రవారంతో మూతపడింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈ థియేటర్‌కు ‘బాహుబలి-2’ సినిమా ప్రదర్శన హక్కులు దక్కలేదు. ‘బాహుబలి’ దెబ్బకు మరో వికెట్!!దీంతో థియేటర్‌ మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది.



తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించి ‘బాహుబలి-2’ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రదర్శన హక్కులు లభిస్తే కొన్నిరోజులైన తాత్కాలికంగా థియేటర్‌ నిలబడేదని ‘షీలా సినిమా’ థియేటర్‌ యాజమాని ఉదయ్‌ కౌషిక్‌ పీటిఐకి తెలిపారు. ‘నిన్నటినుంచి మేం థియేటర్‌ నుంచి మూసివేశాం. గతకొన్నాళ్లుగా నష్టాలు వస్తుండటంతో థియేటర్‌ను నడిపించడం కష్టంగా మారింది. ‘బాహుబలి-2’ ప్రదర్శన హక్కులు లభించి ఉంటే కొంతకాలం థియేటర్‌ మనుగడ కొనసాగేది.



కొంతమేరకు లాభాలు వచ్చేది. దీంతో తాత్కాలికంగా థియేటర్‌ను మూసివేసే పరిస్థితి ఆగేది’ అని కౌషిక్‌ చెప్పారు. అయితే, గతకొంతకాలంగా థియేటర్‌ను మూసివేయాలన్న ఆలోచన ఉందని, బాహుబలి హక్కులు లభించినా.. ఆ తర్వాత కొంతకాలానికైనా థియేటర్‌ మూతపడటం తప్పకపోయేదని తెలిపారు. ఢిల్లీలో మొత్తం 65 థియేటర్లకు బాహుబలి ప్రదర్శన హక్కులు దక్కలేదు. అందులో ఒకటైన షీలా చారిత్రకంగా పేరొందిన థియేటర్‌ కావడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో ప్రముఖ రీగల్‌ థియేటర్‌ మూతపడిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top