ఆ వీడియో టేప్ నాది కాదు: నటి
లాస్ఏంజెల్స్: కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న సెక్స్ టేప్‌పై యువనటి బెల్లా థోర్నే తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోలోని అమ్మాయి తాను కాదని, అలాంటి పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.
అచ్చం బెల్లాను పోలిన ఓ యువతి కారులో కూర్చుని కనిపించే వీడియో ఒకటి బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోకు నటి పేరును ట్యాగ్ చేస్తూ వేలకొద్దీ కామెంట్లు వచ్చాయి. దీంతో ఖంగుతిన్న నటి.. తన అభిమానులకు వివరణ ఇచ్చారు.
‘ఆ వీడియో నిజమని నమ్ముతున్నారా? కాదు, ఫేక్! ఆ (వీడియోలోని) అమ్మాయి.. నా కుటుంబం గురించి చులకనగా మాట్లాడటం దారుణం’ అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల బెల్లా థోర్నే.. టీవీ నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.