లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు


ముంబై:  దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.  సెన్సెక్స్‌ 86 పాయింట్లు పెరిగి 26,964 వద్ద,నిఫ్టీ 17 లాభంతో 8290 వద్ద ట్రేడ్ అవుతోంది.  దాదాపు అన్ని సెక్టార్ లాభాలతో నిఫ్టీ 8300  స్తాయి దిశగా నడుస్తోంది.  ముఖ్యంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్  గ్యాస్ ఆటో, హెల్త్ కేర్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు  0.5 శాతం చొప్పున పెరిగాయి.  పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, పెట్రోనెట్ ఎల్ఎన్జి, హావెల్స్ ఇండియా,  శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్  లాభాల్లో ఉన్నాయి.

 ఎస్ బ్యాంకు 2.4 శాతం లాభాలతో టాప్ విన్నర్ గా  ట్రేడ్ అవుతోంది.  ఒఎన్జిసి, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా,  అదానీ పోర్ట్స్, సిప్లా, ఎసిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతి  ఇన్ ఫ్రాటెల్  లుపిన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా షేర్లులాభాల్లో ఉన్నాయి.  మరోవైపు రూపాయితో  పోలిస్తే  బలహీన డాలర్   ట్రెండ్ ఐటీ షేర్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది.  దీంతో హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో  నష్టాల్లో ఉన్నాయి.



అటు డాలర్ మారకపు  రేటులో  రూపాయి23 పైసలు లాభపడి రూ.67.82 వద్ద ఉంది. బంగారం ధరలు ఎంసీఎక్స్ మార్కెట్ లో పదిగ్రా.  46 నష్టపోయి రూ.27,902 వద్ద ఉంది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top