వాతావరణ కాలుష్యం నుంచి కాపాడే బీర్!

వాతావరణ కాలుష్యం నుంచి కాపాడే బీర్!


మెల్ బోర్న్:ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ వాతావరణ కాలుష్యం బారిన పడుతూనే ఉంటారు. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా ప్రతీ ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే  కాకుండా , రోగాల బారిన పడే వారు కూడా లెక్కకు మించే ఉంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ తో అల్లాడిపోతున్నజనాభాను చల్లబరిచేందుకు శాస్త్రవేత్తలు కొత్త ద్రవపదార్ధాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు. పచ్చ రంగులో ఉండే ఈ ద్రావకానికి బీర్ లో ఉపయోగించే బార్లి గింజలనే ప్రధానంగా వినియోగించినట్లు క్వీన్స్ లాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త  పీటర్ గోస్ తెలిపారు.


 


కాలుష్యం బారిన పడి వేడిని తట్టుకోలేని సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని ద్వారా అధికమొత్తంలో కాలుష్యానికి గురైన వ్యక్తికి ఉపశమనం చేకూరుతుందని పరిశోధకులు తెలిపారు. దీని ధర సాధారణ బీర్ ల కంటే అధిక మొత్తంలొ ఉంటుందన్నారు. దీని ధర 5 యూఎస్ డాలర్లు మొదలుకొని 20 డాలర్ల వరకూ ఉండవచ్చన్నారు. కాగా,  అసలు ధర ఎంత ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top