ఆర్థర్ రోడ్డు జైలుకు సల్మాన్ తరలింపు
మంబై : హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడి సల్మాన్ ఖాన్‌ను ముంబై ఆర్థర్ రోడ్డులోని జైలుకు తరలించారు. అయితే సల్మాన్‌కు విధించిన శిక్షకి సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలు మరికాసేపట్లో అతడి తరపు న్యాయవాదులకు అందనున్నాయి. సల్మాన్‌కు బెయిల్ మంజూరు కోసం అతడి తరపు న్యాయవాదులు గురువారం ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం.
2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అయిదేళ్లపాటు జైలు శిక్ష పడింది. బుధవారం మధ్యాహ్నం ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు తీర్పును వెలువరించారు. సల్మాన్ కు జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించారు. దాంతో సల్మాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.