జీతాల తీపికబురు వస్తే.. కొత్తకారు!

జీతాల తీపికబురు వస్తే.. కొత్తకారు!


న్యూఢిల్లీ : జీతాల పెంపుపై నేడు(బుధవారం) కేంద్రప్రభుత్వం ప్రకటించబోయే తీపికబురు కార్ల, గృహాల అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తుందట. పెట్టుబడులను ప్రోత్సహించి, ఆర్థిక వ్యవస్థను మరింత పుంజుకునేలా చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల నెలల్లో అస్థిరంగా నమోదవుతూ వస్తున్న పారిశ్రామిక ఉత్పత్తికి ఆశాజనకంగా మారుతుందని పేర్కొంటున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి నిరాశజనకమైన ఫలితాలనే నమోదుచేసింది. తయారీ, నాన్ డ్యూరబుల్ స్తబ్థుగా ఉండిపోయింది. ఈ పెంపుతో ఉద్యోగుల ఖర్చులు పెరిగి, ఆర్థిక పునరుజ్జీవనానికి సాయపడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.


ప్రభుత్వం వెలువరించే తీపికబురు వినియోగదారుల డిమాండ్ ను చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందని నోమురా బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనావేస్తోంది. జీతాల సమగ్రపెంపుతో వినియోగదారుల ఖర్చు అమాంతం పెరిగిపోతుందని వెల్లడిస్తోంది. కార్లు, టీవీలర్లు, గృహాలు ఎక్కువగా కొంటారని అంచనావేస్తోంది. కాగా 2008లో చేపట్టిన ఆరవ వేతన సంఘ సిపారసుల వేతనాలు పెంపుతో కూడా కార్లు, గృహాలు కొనడానికే ఉద్యోగులు ఎక్కువగా మొగ్గుచూపారని తన రిపోర్టులో పేర్కొంది. 2008-09లో ప్యాసెంజర్ల వెహికిల్స్ దాదాపు 20 శాతం పెరిగాయని, తర్వాతి ఏడాది 22 శాతం పెరిగాయని వెల్లడించింది. ఈ దాదాపు 48 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, 55 లక్షల పెన్షనర్లకు ఈ జీతాల పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. 7వ వేతన సంఘ సిపారసులపై ప్రభుత్వం నేడు తుది ప్రకటన వెలువరించనుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top