‘అంతరం’పై కదిలిన యంత్రాంగం

‘అంతరం’పై కదిలిన యంత్రాంగం - Sakshi


- నేత కార్మికులు, ఆసాములపై ప్రత్యేక దృష్టి

- కార్మికుల వేతనాల పెంపుపై కసరత్తు




సాక్షి, సిరిసిల్ల:
తెలంగాణలో పవర్‌లూంకు అగ్రగా మిగా ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో యజమానులు, ఆసాములు, కార్మికుల మధ్య ఉన్న అంతరంపై ప్రభుత్వ యంత్రాంగం కదలింది. ‘ఒకే దా రం..ఎందుకీ అంతరం’ శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. వస్త్రపరిశ్రమపై ఆధారపడిన వారిలోనే యజమానులు కోటీశ్వరు లుగా, ఆసాములు, కార్మికులు కనీసం బతకలేని దుస్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్న ‘అంతరం’పై సర్వత్రా చర్చ మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సైతం ఈ కథనంపై ఆరా తీశారు.



ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల తయారీకి పెట్టుబడి కోసం మ్యాక్స్‌ సొసైటీలు యజమానులపై ఆధారపడకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుండడంతో ఆసాములకు తాము రుణాలు ఇవ్వడానికి సిద్ధమేనని బ్యాంకర్లూ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీలు నేరుగా మ్యాక్స్‌ సొసైటీలకే అందించాలని.. యజమానుల ప్రవేశాన్ని నివారించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ చర్యలు చేపట్టారు. ఒక్కో మ్యాక్స్‌ సొసైటీకి రూ.50 లక్షలుబ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయాలని ప్రణాళిక రూపొందించారు.


దీనికోసం కేడీసీసీ, అర్బన్‌ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు. అలాగే, రుణం దారి మళ్లకుండా ఉండేందుకు మ్యాక్స్‌ సొసైటీలు నూలు కొనుగోలు చేసే మిల్లులకే నేరుగా నగదు ఇవ్వను న్నారు. కార్మికులకు సంబం ధించిన బిల్లులు సమర్పిస్తే అంతమేరకు నిధులు చెల్లి స్తారు. వస్త్రం తయారీ పూర్త యిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు కూడా బ్యాంకుల ద్వారానే చెల్లించనున్నారు. ఇదిలాఉంటే.. పెట్టుబడికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం, తయారు చేసిన బట్టను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో వస్త్రపరిశ్రమలో నెలకొన్న అంతరం కొంతైనా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క కార్మికుల కూలి రేట్లు కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లకు సంబంధించిన కూలిని పెంచారు. తర్వాత నేత కార్మికులకు గిట్టుబాటు కూలి అందించేందుకు వేజ్‌బోర్డు నియమించాలనే ఆలోచనతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top