'జైశంకర్ నియామకంలో రాజకీయ ఉద్దేశ్యం లేదు'

'జైశంకర్ నియామకంలో రాజకీయ ఉద్దేశ్యం లేదు'


న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో ఆయన నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్.జైశంకర్కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.


ఆ వెంటనే ఆదేశాలు జారీ కావడం.... జైశంకర్ బాధ్యతలు స్వీకరించడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతాసింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే ఆ పదవి నుంచి ఆమెను తప్పించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన మరుసటి రోజే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు.... సుజాతా సింగ్ను ఆ పదవి నుంచి అమర్యాదగా  తప్పించారని కాంగ్రెస్ పార్టీ.. మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు సంధించింది. దాంతో కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ నియామకాల్లో రాజకీయ ఉద్దేశ్యం లేదని బీజేపీ స్పష్టం చేసింది. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top