డాలర్‌ ఢమాల్‌: రుపీ రికవరీ

డాలర్‌ ఢమాల్‌: రుపీ రికవరీ


ముంబై:  డాలరుతో మారకంలో  దేశీ కరెన్సీ  వరుసగా రెండో రోజుకూడా బలపడింది.  గురువారం రూపాయి 25 పైసలు  ఎగిసి 64.48 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం మరింత  పుంజుకుంది.   ముఖ్యంగా డాలర్ వ్యతిరేకంగా ఎగుమతిదారులు , బ్యాంకులు అమెరికన్ కరెన్సీ డాలర్‌ లో పెరిగిన అమ్మకాల కారణంగా  రుపాయికి మద్దతు లభిస్తోంది.



ఫెడ్‌ పాలసీ   అంచనాలతో డాలర్‌లో అమ్మకాల మొగ్గు రుపాయికి  మద్దతు నిస్తోందని ఫారెక్స్ డీలర్లు  చెబుతున్నారు. అలాగే వీదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దేశీమార్కెట్లలోజోష్‌ వచ్చినట్టు చెప్పారు. బుధవారం ట్రేడింగ్‌లో 7వారాల కనిష్ట నుంచి  రుపాయి హైజంప్‌ చేసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 16 పైసలు పుంజుకుని 64.73 వద్ద ముగిసింది.కాగా.. డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వస్తున్న రూపాయి మంగళవారం ట్రేడింగ్‌లో ఉన్నట్టుండి 34 పైసలు పతనమై దాదాపు రూ.65 స్థాయికి పతనమైంది. ఇది 7వారాల కనిష్టం, బుధవారం ట్రేడింగ్‌లోనూ తొలుత 64.91వరకూ రూపాయి బలహీనపడింది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్రధానంగా బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో దేశీ కరెన్సీ పుంజుకుంటూ వచ్చింది.



కాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెల 3న నిర్వహించిన సమావేశంలో భాగంగా సహాయక ప్యాకేజీలను ఉపసంహరించనున్నట్లు వెల్లడైంది. ఫెడ్‌ మినిట్స్‌ ద్వారా క్రమానుగతంగా వడ్డీ రేట్లను పెంచనున్నట్లు సంకేతాలు వెల్లడయ్యాయి.  దీంతో ఇన్వెస్లర్లలో ఆందోళన నెలకొంది. డాలర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే  ఫెడ్‌ మినిట్స్‌ దేశీయ ఈక్విటీ మార్కెట్లకు జోష్‌ నిచ్చింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top