మరో 3 నగరాల్లో రూ.5కే భోజనం

మరో 3 నగరాల్లో రూ.5కే భోజనం - Sakshi


- త్వరలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లకు పథకం విస్తరణ

- పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడి

- మున్సిపల్‌ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలపై సమీక్ష

- ఉద్యోగులతో ఇళ్లల్లో పనిచేయించుకోవద్దని కమిషనర్లకు హెచ్చరిక  




సాక్షి, హైదరాబాద్‌:
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో అమలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోని మరో మూడు నగరాలకు రూ. 5కే భోజన పథకాన్ని విస్తరించనున్నామని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లలో భోజన స్టాల్స్‌ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని అధికారు లను ఆదేశించారు.



రాష్ట్రంలోని అన్ని మున్సి పల్‌ కార్పొరేషన్లలో రహదారులు, మార్కెట్లు, మరుగుదొడ్లు, పార్కులు, బస్‌ బేలు, బస్‌ షెల్టర్లు, శ్మశాన వాటికలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై మున్సిపల్‌ కార్పొరే షన్ల కమిషనర్లతో కేటీఆర్‌ మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ప్రతి కార్పొరేషన్‌ భవి ష్యత్తు నివేదిక తయారు చేసుకోవాలని, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని ఆదేశిం చారు. వచ్చే ఏడాది బడ్జెట్లో మున్సిపల్‌ కార్పొ రేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నా మన్నారు. మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర అధికారుల ఇళ్లలో కొందరు మున్సిపల్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్లను హెచ్చరించారు. పురపాలికల నుంచి జీతం తీసుకునే ఉద్యోగి సంస్థ కోసమే పనిచేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు.



సీఎం ఆలోచనలకు తగ్గట్లు...

సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కేటీఆర్‌ సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్ల విస్తరణ, ఫుట్‌పాత్‌లు ఉండాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్థల భూమిని నోటీసులు లేకుండానే వినియోగిం చుకునేందుకు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపయోగించుకుని అవసరమైన చోట బస్‌ బేలు నిర్మించాలని ఆదేశించారు. ఉగాదిలోగా పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.



హైదరాబాద్‌లోని మహా ప్రస్థానం శ్మశానవాటిక స్థాయిలో అన్ని పట్టణాల్లో శ్మశానాలను నిర్మించాలన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, కూరగాయలు, మాంసం విక్రయాలకు మోడల్‌ మార్కెట్లు, మెకనైజ్డ్‌ కబేళాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్లు ఉదయం 5 గంటలకే పారిశుద్ధ్య పనులను సమీక్షించాలని, పట్టణాల్లో అనధికారికంగా ఫ్లెక్సీలు, గోడలపై రాతలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటును సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, డీఎంఏ శ్రీదేవి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ ధన్‌సింగ్, డీటీసీపీ ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top