ఎరక్కపోయిన దొంగ.. ఇరుక్కుపోయాడు!

ఎరక్కపోయిన దొంగ.. ఇరుక్కుపోయాడు! - Sakshi


అతడో చిన్నపాటి దొంగ.. ఏదో దొరికిన కాడికి దొంగిలించి పొట్ట గడుపుకొందాం అనుకుంటాడు. కానీ, ఎరక్కపోయి దొంగతనం చేయబోయి అచ్చంగా 'ఇరుక్కుపోయాడు'. విషయం ఏమిటంటే.. బ్రెజిల్ దేశంలో ఒక దొంగ ఉన్నాడు. ఓ మహిళ  బైకుమీద వెళ్తుండగా ఆపి.. ఆమెను దోచుకుందాం అనుకున్నాడు. అనుకున్నట్లుగానే వెళ్లాడు. బండి ఆపి.. మొబైల్ ఫోన్లు, డబ్బు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. కానీ, ఆ తర్వాత గానీ అతగాడికి అసలు విషయం తెలియలేదు. ఆ దొంగ ఆపిన మహిళ.. మార్షల్ ఆర్ట్స్లో పెద్ద ఛాంపియన్!!



ఆ దొంగ అలా వెళ్లి ఆమెను బెదిరించాలని అనుకున్నాడో లేదో.. తనదైన స్టైల్లో రెండు పంచ్లు ఇచ్చి, కాళ్లు మడతేసి జియు-జిట్సు అనే మూవ్తో అతగాడిని తాడు లేకుండానే బంధించేసింది. దాంతో అతడు 'నాన్నోయ్.. నన్ను ఈవిడ చంపేస్తోంది.. కాస్త కాపాడు' అంటూ గగ్గోలు పెట్టాడు. తన రెండు కాళ్ల మధ్య ఆ దొంగను ఆమె బంధించి, అతడి మెడను 'లయన్ కిల్లర్ చోక్'తో లాక్ చేసేసింది. ఈలోపు పోలీసులకు విషయం చెప్పింది. వాళ్లు వచ్చి అతగాడిని బంధవిముక్తుడిని చేశారు. విషయం ఏమిటంటే, అతగాడు వెళ్లిన ఇంటి యజమానురాలు మిస్ బాస్టోస్కు ఎంఎంఏ ఫైట్స్లో ఆరు ప్రొఫెషనల్ రికార్డులు ఉన్నాయి. అలాంటి ఫైటర్తో పెట్టుకుంటే మాటలా మరి!!

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top