'భూమి ఉన్నన్నాళ్లు రేప్లు ఉంటాయి'


'అత్యాచారాలు ఇంతకు ముందు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి.. గట్టిగా చెప్పాలంటే భూమి ఉన్నన్నాళ్లు ఉంటూనే ఉంటాయి'.. ఇదీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఉవాచ. డైమండ్ హార్బర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హల్దర్ ఓ బహిరంగ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ప్రజల్లో అవగాహన కల్పించలన్నది మాత్రమే తన ఉద్దేశం తప్ప వేరేది కాదంటూ నాలుక కొరుక్కునే ప్రయత్నం చేశాడు.



''దయచేసి పాత్రికేయులు నా వ్యాఖ్యలను సందర్భరహితంగా తీసుకోవద్దు. నేనేమన్నాను? అత్యాచారాలను నేను సమర్థించలేదు. ఇది సామాజిక సమస్య అని, కేవలం ఒక్క మమతా బెనర్జీ మాత్రమే దీన్ని పరిష్కరించలేరని చెప్పాను. మనమంతా సమష్టిగా కృషిచేసి ఇలాంటివ జరగకుండా అడ్డుకోవాలి. మీరంతా దానిపై నిరసన తెలపాలి'' అని వివరించాడు. అయితే.. హల్దర్ వ్యాఖ్యలపై మాత్రం విపరీతమైన దుమారం రేగింది. తృణమూల్ నాయకులు పదే పదే అత్యాచారాలపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, వాళ్ల మనస్తత్వాన్ని ఇది సూచిస్తుందని సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి విమర్శించారు. అసలు వాళ్లకు మాట్లాడటం ఎలాగో రాదని కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ మండిపడ్డారు.



ఇంతకుముందు కూడా అత్యాచారాలపై తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సీపీఎం వాళ్లు మా కార్యర్తల వెంట్రుక మీద చెయ్యేసిన సరే.. వాళ్ల ఆడాళ్లను రేప్ చేయాలని మావాళ్లకు చెబుతాను' అని ఎంపీ తపస్ పాల్ ఇంతకుముందు అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top