శిల్పాశెట్టి దంపతులకు బెదిరింపు కాల్!

శిల్పాశెట్టి దంపతులకు బెదిరింపు కాల్! - Sakshi


ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులకు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో వారికి అదనపు పోలీస్ భద్రతను సమకూర్చారు.   మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పుజారి పేరుతో బెదిరింపు కాల్ రావడంతో ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో వారికి అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాకు వచ్చిన కాల్ పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


ఈ కాల్ ఉదంతం ఆకతాయిల చేష్టల్లో భాగమేనా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అంతకుముందు షారుఖ్ ఖాన్, సోనూ సూద్, బోమన్ ఇరానీలకు రవి పుజారా పేరుతో బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top